Sania Mirza: సల్మాన్ ఖాన్ తో ప్రేమలో ఉన్నా - సానియా మీర్జా షాకింగ్ కామెంట్స్..!

Fri, 13 Sep 2024-12:32 pm,

ప్రస్తుతం సానియా మీర్జా తన భర్త నుంచి వేరుపడిన తర్వాత కొడుకుతో నివసిస్తోంది.  నిజానికి పాకిస్తాన్ కి చెందిన ప్రముఖ క్రీడాకారుడు షోయబ్ మాలిక్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకున్న ఈమెకు.. ఆ సమయంలో ఇండియా నుంచి ఎన్నో వ్యతిరేకతలు ఎదురయ్యాయి. అన్నింటిని అధిగమించి  భర్త కోసం నిలబడింది ఈ ముద్దుగుమ్మ. అయితే అతడితో ఎక్కువ కాలం ఉండలేకపోయింది. ఇప్పుడు అతడికి విడాకులు ఇచ్చి కొడుకుతో మాత్రమే ఒంటరిగా జీవిస్తోంది.   

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈమె గురించిన పెళ్లి వార్తలు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి. అందులో ఒకటి క్రికెటర్ మహమ్మద్ షమీ ని ఈమె రెండో వివాహం చేసుకోవడానికి సిద్ధమైందని సమాచారం. అయితే ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో మరొక వార్త తెరపై సంచలనం సృష్టించింది. సానియా మీర్జా,  సల్మాన్ ఖాన్ లకు సంబంధించిన ఒక వార్త నెట్టెంట చాలా వైరల్ గా మారుతోంది. దీనికి కారణం పలుమార్లు వీరిద్దరూ మీడియా కంటే పడడమే. దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఇద్దరి మధ్య చనువు కాస్త పెరిగిందని,  అందుకే ఇద్దరూ కలిసి కనిపిస్తున్నారు అంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు. ఇక ఇలా ఒకవైపు పుకార్లు వస్తుండగా, మరొకవైపు వీరిద్దరూ వివాహం చేసుకుంటారంటూ రూమర్స్  గుప్పుమంటున్నాయి. 

ఇదిలా ఉండగా ఇటీవల సానియా మీర్జా పుస్తక విడుదలకు సల్మాన్ ఖాన్ చాలా సపోర్ట్ చేశారు. అంతేకాదు ఆ పుస్తక లాంచ్ రోజున సల్మాన్ ఖాన్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు మరింత వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే వీటన్నింటినీ పక్కన పెడితే ఇప్పుడు సానియా మీర్జా చేసిన ప్రకటన అందరిలో కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. 

కాఫీ విత్ కరణ్ షో లో సల్మాన్ ఖాన్ తో ప్రేమలో ఉన్నానని ఈమె చెప్పుకొచ్చింది. అయితే ఇది పాత వీడియో అయినప్పటికీ కూడా నెటిజెన్లు ఈ వీడియోని మళ్లీ షేర్ చేస్తూ సల్మాన్ ఖాన్ ఒంటరిగా ఉన్నారని,  సానియా విడాకులు తీసుకున్నారని , కాబట్టి వీరు పెళ్లి చేసుకుంటారంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి గతంలో ఈమె చేసిన వీడియోకి ఇప్పుడు ఇలాంటి రెస్పాన్స్ లభిస్తోంది. మరి దీనిపై సానియా ఎలాంటి కామెంట్లు చేస్తుందో చూడాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link