Sanjay Dutt: అలా చేసి నన్ను అవమానించకండి ప్లీజ్

Thu, 31 Dec 2020-7:31 am,

యష్ హీరోగా వచ్చన KGF చిత్రం దేశ వ్యాప్తంగా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.  

ఈ మూవీ సాధించిన విజయం తరువాత దీని సీక్వెల్‌ను ప్లాన్ చేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహలు చేస్తున్నారు.

KGF 2 లో బాలీవుడ్ కల్నాయక్ సంజయ్ దత్  విలన్‌గా నటిస్తున్నారు.  

అయితే కొంత కాలం క్రితం సంజూకు ఆరోగ్య సమస్యలు రావడంతో గ్యాప్ తీసుకుని మళ్లీ షూటింగ్‌లో చేరారు.   

దాంతో సినిమాలో సంజూ స్టంట్స్ తేలికగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అది తెలుసుకున్న సంజూ బాబా... అలా సింపుల్ స్టంట్స్‌తో తనను అవమానించవద్దు అని కోరారు.

కథలో విలన్ ఎలాంటి స్టంట్స్ చేయాలో అవి తప్పకుండా చేస్తాను అని..ప్రేక్షకులకు కావాల్సింది అందించాలి అనుకుంటున్నాను అని స్పష్టం చేశారు. ఇది విని కేజీఎఫ్ టీమ్ తెగ సంతోషడింది అని సమాచారం

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link