Sankranthi Muggulu 2025 Pics: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా ఇంటి ముందు వేసుకోవాల్సిన 7 ముగ్గులు..
ఆధునిక జీవనశైలి కారణంగా అన్నింటిలోనూ మార్పులు వస్తున్నాయి. అయితే సంక్రాంతి ముగ్గుల డిజైన్స్ లో కూడా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు పూర్వీకులు సంక్రాంతి పండగ రోజు వాకిలి నిండా సుద్ద పిండితో గీతాలు పెట్టేవారు.
అంతేకాకుండా మకర సంక్రాంతి రోజు తప్పకుండా ఐదు చుక్కల ముగ్గులు పూర్వికులు వేసేవారట. అప్పట్లో మూడు చుక్కలతో పాటు ఐదు చుక్కల ముగ్గును కూడా ఎక్కువగా వేసే వారు.. ఇప్పటికీ ఈ ముగ్గులను చాలామంది వారి ఇళ్లలో వేసుకుంటున్నారు.
పూర్వికులు వాకిట్లో దిద్దిన గీతలు కలిగిన ముగ్గులు అప్పుడు ఎంతో ఆకర్షణీయంగా కనిపించేది. వీటితోపాటు సంక్రాంతికి సంబంధించిన కొన్ని సింబల్స్ కూడా వేసేవారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో గంగిరెద్దు, కుండలో పాలు పొంగించడం వంటి డిజైన్స్ కలిగిన ముగ్గులు సంక్రాంతి రోజు వాకిళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి.
అంతేకాకుండా పూర్వీకులు సంక్రాంతి రోజు తప్పకుండా వాకిట్లో వేయాల్సిన కొన్ని ముగ్గుల గురించి కూడా పేర్కొన్నారు. అందులో మొదటిది రథం ముగ్గు. ఈ ముగ్గు వేయడం చాలా సులభం చుక్కల పద్ధతిలో వేయడం వల్ల ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
సంక్రాంతి రోజు చాలా మంది ఎక్కువగా వేసే ముగ్గుల్లో నెమలి బొమ్మ కలిగిన ముగ్గులను కూడా వేస్తూ ఉంటారు. ఈ ముగ్గుల్లో కలర్స్ ఫిల్ చేయడం వల్ల ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
మకర సంక్రాంతి రోజు చాలా మంది గాలిపటాల ముగ్గులను కూడా వేస్తారు దీంతో పాటు చెరుకు గడెలు, కుండలో నుంచి పాలు పొంగడం వంటి డిజైన్స్ ముగ్గులు వేయడం ఆనవాయితీగా వస్తుంది.
అంతేకాకుండా పండగ రోజు తులసి చెట్టును డిజైన్ కూడా ముగ్గుగా వేస్తారు. ఈ సింపుల్ డిజైన్ లో ఆకులను వేసి అందులో గ్రీన్ కలర్స్ నింపి ముగ్గును ఎంతో అందంగా అలంకరిస్తారు.