Sankranthiki Vasthunnam Box Office Collections: ఒక్క సినిమా ఎన్నో రికార్డులు ఫసక్.. వెంకీ మామ మజాకా..

Thu, 30 Jan 2025-8:09 am,
Sankranthiki Vasthunnam Box Office Collections Records

Sankranthiki Vasthunnam Box Office Collections: బిందువు, బిందువు కలిసి సింధువుగా  మారినట్టు.. సంక్రాంతి సినిమాల్లో మినిమం బడ్జెట్ తో లెస్  టైమ్ లో తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ తో సంక్రాంతి సీజన్ లో చివర్లో విడుదలైన  వెంకటేష్ ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమా ఒక్కో రికార్డును బ్రేక్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతూనే ఉంది. 

Venkatesh

కొన్ని సార్లు కొన్ని అద్భుతాలు జరిగిపోతుంటాయి. అలాంటి అద్భుతం వెంకటేష్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విషయంలో జరిగింది. పొంగల్ పోటీలో విడులైన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులను బ్రేక్ చేసింది.  రికార్డు బద్దలు కొడుతోంది. సంక్రాంతి అతి తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా అందరి కంటే ఎక్కువ వసూళ్లను సాధించి రికార్డు క్రియేట్ చేసింది.

Venky Power full Come Back

గత కొన్నేళ్లుగా సీనియర్ హీరోల్లో వెంకటేష్ సినిమాలు వస్తే పట్టించుకునే వారు కాదు.గతేడాది పొంగల్ సీజన్ లో విడుదలైన వెంకటేష్ ‘సైంధవ్’ మూవీ మొత్తం కలెక్షన్స్ రూ.10 కోట్ల షేర్ మార్క్ కూడా దాటలేదు. అలాంటి స్థితిలో ఇపుడు రూ. 300 కోట్ల గ్రాస్.. రూ. 150 కోట్ల షేర్ మార్క్ అందుకోవడం మాములు కమ్ బ్యాక్ కాదు.

వెంకటేష్ కెరీర్ లో ఓ బొబ్బిలి రాజా, చంటి, ప్రేమించుకుందాం..రా,  నువ్వు నాకు నచ్చావ్, జయం మనదేరా, మల్లీశ్వరి సినిమాల సరసన చేరింది. అంతేకాదు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది.

ఫస్ట్ ఫోర్ డేస్ లో సంక్రాంతి పోటీలో విడుదలైన ‘డాకు మహారాజ్’ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ను బీట్ చేసిన  ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా .. వారం రోజుల్లో రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ లైప్ టైమ్ వసూళ్లను దాటేసి పరుగులు తీస్తోంది. ఒక రకంగా మన దేశంలో తొలి హిట్.. సూపర్ హిట్.. బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా పలు రికార్డులను సెట్ చేసింది. అంతేకాదు యూఎస్ బాక్సాఫీస్ మూడు మిలియన్ డాలర్స్ వైపు పరుగులు తీస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 33 కోట్ల బిజినెస్ చేసింది. అంతేకాదు రూ. 33 కోట్లకు గాను తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 100 కోట్ల షేర్ (రూ. 200 కోట్ల గ్రాస్) తో పాటు దాదాపు ప్రీ రిలీజ్ బిజినెస్ పై రూ.77 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

 

‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 41.50 కోట్ల ప్రీ రిలీజ్ కు గాను రూ. 150 కోట్ల షేర్ (రూ.270 కోట్ల గ్రాస్) వసూళ్లతో సంచలనం రేపింది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో సోలో హీరోగా తొలి రూ. 100 కోట్ల గ్రాస్..తో పాటు తొలి రూ. 100 కోట్ల షేర్ సాధించింది. అంతేకాదు తెలుగు స్టేట్స్ లో రూ. 100 కోట్ల కు పైగా షేర్ సాధించిన మూవీగా పలు రికార్డులను తిరగరాస్తోంది. అంతేకాదు మొత్తం బిజినెస్ లో దాదాపు రూ. 110 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.  

 

ఇప్పటి వరకు సంక్రాంతి సినిమాల్లో ‘అల వైకుంఠపురుములో’తో పాటు ప్యాన్ ఇండియా సంక్రాంతి చిత్రాల్లో హనుమాన్ టాప్ ప్లేస్ లో ఉన్నాయి. ఈ రెండు సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్స్ ను దాటేసి నాన్ ప్యాన్ ఇండియా కేటగిరిలో ఓన్లీ తెలుగులో ఈ రేంజ్ వసూళ్ల సునామీ వెంకటేష్  బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేయడం అంటే మాములు విషయం కాదు.

మొత్తంగా ఫ్యామిలీస్ లో వెంకీ ఇమేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదనే విషయం మరోసారి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ప్రూవ్ అయింది. అంతేకాదు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, సైరా నరసింహారెడ్డి సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్స్ దాటేసి సీనియర్ హీరోల్లో తోపు హీరోగా నిలిచారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో వెంకటేష్ .. చిరంజీవి, రజినీకాంత్, కమల్ హసన్ ల సరసన చేరారు. 60 ప్లస్ ఏజ్ లో రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సీనియర్ హీరోగా తన పేరిట క్రియేట్ చేశారు. అంతేకాదు ‘సంక్రాంతికి వస్తున్నాం’ త్వరలో రూ. 300 కోట్ల క్లబ్బులో ప్రవేశించినా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు.   

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link