School Holidays: పదో తరగతి పరీక్ష షెడ్యూల్ ఖరారు.. సంక్రాంతి సెలవులు కుదింపు..!
సంక్రాంతి ప్రతి ఏడాది జనవరిలో నెలలో వస్తుంది. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈ పండుగకు స్కూళ్లకు దాదాపు 5 రోజుల వరకు సెలవులు వచ్చేవి. పిల్లా పెద్దా అందరూ కలిసి వేడుకగా ఈ పండుగను నిర్వహించుకుంటారు. దేశంలో ఏ మూలన ఉన్న స్వగ్రామానికి చేరుకుంటారు.
అందుకే ఈ పండుగకు అన్ని రోజులు సెలవులు వచ్చేవి. ముఖ్యంగా మూడు రోజుల పాటు సంక్రాంతి నిర్వహిస్తారు. అయితే, నిన్న పదో తరగతి పబ్లిక్ పరీక్ష షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి సెలవులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కుదించింది.
సాధారణంగా పదో తరగతి పరీక్షలు మార్చి 15వ తేదీన నిర్వహిస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ, మరో మూడు రోజుల గడువు పెంచి మార్చి 18వ తేదీ నుంచి ఏపీ పదో తరగతి పరీక్షల నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి సెలవులను మూడు రోజులకు కుదించింది.
ముఖ్యంగా సంక్రాంతి సెలవులు 13, 14, 15 మూడు రోజులు స్కూళ్లకు సెలవులు ఇవ్వనున్నారు. అంతేకాదు పదో తరగతి విద్యార్థులకు అదనప్పు క్లాసులను నిర్వహించేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలు మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ నిన్న విద్యాశాఖ విడుదల చేసింది. పరీక్ష ఫీజు ప్రక్రియ కూడా మొదలైంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ విద్యాశాఖ ప్రభుత్వానికి సమర్పించింది.