Saptami Gowda: ప్రేమలో ఉన్నట్లే నటించాలి.. సప్తమి గౌడ షాకింగ్ కామెంట్స్!
కన్నడలో రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతారా సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా లో టాలెంటెడ్ బ్యూటీ సప్తమి గౌడ హీరోయిన్ గా కనిపించింది. అన్ని భాషల్లోనూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో.. ఈ భామ మీద ఉన్న క్రేజ్ కూడా పెరిగింది.
అప్పటినుంచి సినిమాలతో బిజీగా ఉన్న సప్తమి గౌడ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె చెప్పినా కొన్ని షాకింగ్ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో.. తెగ వైరల్ గా మారాయి. ఫటాఫట్ అనే రౌండ్ లో.. సప్తమి గౌడని అడిగిన ప్రశ్నలకి వెంటనే జవాబులు చెప్పమని కోరారు.
సప్తమి గౌడ కూడా అలానే జవాబులు చెప్పడానికి సిద్ధం అయింది. తన ఫేవరెట్ క్రికెటర్.. ఎవరు అని అడగగానే విరాట్ కోహ్లీ అని చెప్పిన సప్తమి.. షూటింగ్ సమయంలో ఇష్టమైన పాట అనగానే కవిత కవిత అని.. ఎందుకంటే అది తను పుట్టి పెరిగిన బెంగళూరులో షూటింగ్ జరిగింది అని చెప్పింది సప్తమి.
తన ఇంటి వైఫై పాస్వర్డ్ ఏంటి అని అడగగా సప్తమి గౌడ సింబా అని చెప్పింది. అది తను పెంచుకుంటున్న కుక్కపిల్ల పేరు అని, దానినే వైఫై కి పాస్వర్డ్ గా పెట్టినట్లు స్పష్టం చేసింది ఈ భామ. ఇక షూటింగ్ సమయంలో సహనాటులతో ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా అని అడగగా సప్తమి ఆసక్తికరమైన జవాబు ఇచ్చింది.
ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు కన్విన్స్ అవడం కోసం.. ఆ ఎమోషన్ పలకడం కోసం.. ఆ ఎదుటి వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లే నటించాలి అని చెప్పింది సప్తమి. ప్రేమ, క్రష్ ఏమీ లేకపోయినా బ్రేకప్ సీన్ అయితే నిజంగానే బ్రేకప్ అయినట్లే నటించాలి అని చెప్పుకొచ్చింది. ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.