Saturn And Rahu: 50 ఏళ్ల తర్వాత శని, రాహు అరుదైన కలయిక.. ఈ రాశుల వారికి ధనయోగం.. దసరా ముందు నుంచే డబ్బే డబ్బు!
ఇదిలా ఉంటే శని గ్రహం రాశి సంచారం చేయడమే కాకుండా నక్షత్ర సంచారం కూడా చేస్తాడు. అయితే ఈ గ్రహం అక్టోబర్ మూడవ తేదీన నక్షత్ర సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరగబోతోంది.
అక్టోబర్ మూడో తేదీ 12 గంటల 30 నిమిషాలకు కొన్ని సంవత్సరాల తర్వాత శతభిషా నక్షత్రం లోకి సంచారం చేసింది. ఇప్పటికే రాహు గ్రహం అదే నక్షత్రంలో సంచార దశలో ఉన్నాడు. దీని కారణంగా శని రాహు గ్రహాల కలయిక జరిగింది.
దాదాపు 50 సంవత్సరాలు తర్వాత శని, రాహు కలయిక జరిగిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రెండు గ్రహాలు శుభస్థానంలో ఉన్న రాశుల వారికి బ్రహ్మాండమైన లాభాలు కలుగుతాయి.
రాహు, శని గ్రహాల కలయిక కారణంగా మకర రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారు ఊహించని ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. అలాగే ఈ సమయంలో ధైర్యంతో పాటు విశ్వాసం కూడా పెరుగుతుంది. గతంలో నిలిచిపోయిన డబ్బులు కూడా సులభంగా తిరిగి వస్తాయి. వ్యాపారాలు చేసే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.
శతభిషా నక్షత్రంలో రాహుతో పాటు శని కలయిక కారణంగా తులా రాశి వారికి ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకున్న పనులు వెంటవెంటనే జరుగుతాయి. అలాగే ఈ రాశి వారు కొన్ని శుభవార్తలు కూడా వింటారు. ఈ సమయంలో డబ్బులు ఆదా చేయడం వల్ల ఎన్నో రకాల ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితంలో వస్తున్న అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
రాహు, శని గ్రహాల కలయిక కారణంగా అత్యధిక లాభాలు పొందబోయే రాష్ట్రంలో మిథున రాశి ఒకటి. వీరికి ఈ సమయంలో అదృష్టం పెరగడమే కాకుండా, వ్యాపారాలు చేస్తున్న వారికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అలాగే కెరీర్ జీవితంలో కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
నోట్: ఇది కేవలం జ్యోతిష్యాల అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని రాసిన స్టోరీ మాత్రమే దీనికి జీ తెలుగు న్యూస్ కి ఎలాంటి సంబంధం లేదు. ఇది మీ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.