Shani Nakshatra Transit: శని సంచారంతో ఈ రాశుల వారికి స్వర్ణయుగం.. ఇక దశ తిరిగినట్లే..!
మేష రాశి వారు వృత్తిపరంగా సవాళ్లను ఎదుర్కోనే అవకాశం ఉంది. పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. ఒత్తిడికి లోనవుతారు. ఖర్చులు తగ్గించుకుని.. పొదుపు వైపు అడుగులు వేస్తారు.
వృషభ రాశి వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. తోబుట్టువులతో మనస్పర్థలు తొలగిపోతాయి.
మిథున రాశి ఆఫీసులో ఎక్కువ పనిచేయాల్సి రావచ్చు. ఈ రాశి వారు అసూయపడే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. అన్ని అప్పులు చెల్లించాల్సిన సమయం వచ్చింది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు.
కర్కాటక రాశి వ్యక్తులకు కొత్త మార్గాల ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు కష్టపడాల్సి వస్తుంది.
సింహ రాశి వారు భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. వైవాహిక జీవితంలో కాస్త ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది.
కన్యా రాశి వారికి శని సంచారంతో కలిసి వస్తుంది. ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది.
తుల రాశి వారు వృత్తిపరంగా కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ద వహించండి.
వృశ్చిక రాశి వ్యక్తులు వృత్తిపరంగా ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారాన్ని కొత్త మార్గంలో అభివృద్ధి చేయండి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువ లాభాలు పొందవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది.
ధనుస్సు రాశి వారికి ఇది అద్భుత సమయం. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ వాతావరణం ఆనందకరంగా ఉంటుంది.
మకరరాశి వారికి వ్యాపారంలో నెలకొన్న ఆటంకాలు తొలగిపోతాయి. కొత్త ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు ఉంటాయి.
కుంభ రాశి వారికి బిజినెస్‌లో కలిసి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు. ఆదాయంలో పెరుగుతుంది.
మీన రాశి వారు స్ఫూర్తితో నిండి ఉంటారు. కార్యాలయంలో మరిన్ని బాధ్యతలు పెరగవచ్చు. అదేవిధంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఉదాసీనతకు చోటు ఇవ్వకండి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి.
శని చాలీసా, హనుమాన్ చాలీసా పఠిస్తే శనిదేవుని అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. అదేవిధంగా దానధర్మాలు, పేదలకు సహాయం చేసేవారిని శని దేవుడు ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు ఆధారంగా రాసినంది. ఈ సమాచారాన్ని జీ తెలుగు మీడియా ధృవీకరించలేదు.