Saturn Transit 2023: శని గ్రహం శతభిష నక్షత్ర ప్రవేశం, ఈ 5 రాశులకు లాటరీ తగిలేసింది

Fri, 10 Mar 2023-7:46 am,

ధనస్సు

జ్యోతిష్యం ప్రకారం శతభిష నక్షత్రంలో శని గోచారం ప్రభావం ధనస్సు రాశివారికి  అత్యంత శుభసూచకం. దీర్ఘకాలంగా ఉద్యోగం వంటి పెండింగ్ సమస్యల్నించి విముక్తి పొందుతారు. పదోన్నతి ఉంటుంది. వ్యాపారంలో విజయం లభిస్తుంది. 

తుల రాశి

శని నక్షత్ర గోచారం ఈ రాశివారికి అత్యంత లాభదాయకం. ఈ రాశివారి జీవితంలో సంతోషం రానుంది. ఉద్యోగులకు ఈ సమయం చాలా అనువైనది. వ్యాపారులకు లాభాలుంటాయి. కుటుంబంతో కలిసి మంచి సమయం గడుపుతారు. 

సింహ రాశి

ఉద్యోగం కోసం అణ్వేషిస్తుంటే మార్చ్ 15 తరువాత  మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. శని గ్రహం నక్షత్ర గోచారంతో ఈ రాశి జాతకులకు శుభసూచకంగా ఉంటుంది. శని గ్రహం శతభిష నక్షత్రంలో ప్రవేశించడం వల్ల చాలాకాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి.

మిధున రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సమయం ఈ రాశివారికి అత్యంత అనుకూలమైంది. ఈ సమయంలో శని శతభిష నక్షత్రంలో ప్రవేశించడం లాభదాయకం కానుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు మంచి సమయం. లాభాలు ఆర్జిస్తారు. శని దోషం నుంచి విముక్తి కలుగుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ప్రతిరంగంలో విజయం లభిస్తుంది. 

మేష రాశి

జ్యోతిష్యం ప్రకారం శని గ్రహం శతభిష నక్షత్రంలో ప్రవేశించడం వల్ల ఈ రాశి జాతకుల జీవితంపై విశేష ప్రభావం పడుతుంది. మేషరాశి జాతకులకు పెట్టుబడులతో లాభాలు కలుగుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం. ఉద్యోగులకు పదోన్నతి లేదా ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link