Saturn Transit 2024: శని గోచారం ఎఫెక్ట్ మరో 48 గంటల్లో ఈ నలుగురిపై కనకవర్షం
శనిగ్రహం గోచారం అనేది చాలా కీలకం. హిందూ జ్యోతిష్యం ప్రకారం మనిషి జీవితాన్ని శాసించేది నిర్దేశించేది శనిగ్రహం కదలికలే. చేసిన పనుల్ని బట్టి న్యాయదేవతగా భావించే శనిగ్రహం ప్రతిఫలం అందిస్తుంది. అక్టోబర్ 3 న శనిగ్రహం నక్షత్రం మారనుంది. శతభిష నక్షత్రంలో ప్రవేశించడంతో 4 రాశులకు మహర్దశ పడుతుంది. ఈ 4 రాశులవారికి ఊహించని విధంగా సంపద వచ్చి పడుతుంది.
మేష రాశి
శని గ్రహం నక్షత్రం మారడం అనేది చాలా కీలకమైంది. రాహువు నక్షత్రంగా భావించే శతభిషంలో ప్రవేశించడంతో మరో 48 గంటల్లో ఈ రాశి జాతకం మారిపోనుంది. దూర ప్రయాణాలు చేస్తారు. అంతా కలిసొస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది.
ధనస్సు రాశి
ధనస్సు రాశి జాతకులకు శని గ్రహం శతభిషంలో ప్రవేశించడం వల్ల ఊహించని పరిణామాలు ఎదురౌతాయి. ఈ సమయంలో తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఎప్పట్నించో పెండింగులో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు.
సింహ రాశి
శని గ్రహం గోచారం కారణంగా సింహ రాశి జాతకులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లోవిజయం లభిస్తుంది. పెళ్లి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఉద్యోగస్థులకు పదోన్నతితో పాటు వేతనం పెంపు ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్ధులు రాణిస్తారు. ఊహించని విధంగా సంపద వచ్చి పడుతుంది. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు.
వృషభ రాశి
అక్టోబర్ 3వ తేదీన అంటే మరో 48 గంటల్లో శనిగ్రహం శతభిష నక్షత్రంలో ప్రవేశించనుంది. ఫలితంగా వృషభ రాశి జాతకులకు అత్యంత శుభ సమయం. విద్యార్ధులకు, ఉద్యోగులకు కెరీర్ బాగుంటుంది. వ్యాపారులకు కలిసొస్తుంది. ఆకశ్మిక ధనలాభం కలగడంతో ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.