Shani Nakshatra Transit Effect: శని సంచార ప్రభావం.. ఈ రాశుల వారికి జాక్‌పాక్..!

Fri, 30 Aug 2024-5:04 pm,

శని గ్రహ ప్రభావంతో వృషభ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారంలో మంచి వృద్ధి ఉంటుంది. విదేశీ యానం ఉంటుంది. ధనలాభంతోపాటు వ్యాపారస్తులకు కలిసి వస్తుంది.  

సింహ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారుస్తుల తమ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. పై అధికారుల నుంచి మంచి సపోర్టు ఉంటుంది. ఇష్టమైన కంపెనీలో పనిచేసే అవకాశం లభిస్తుంది.  

వృశ్చికరాశి వారికి అనుకూల ఫలితాలు వస్తాయి. యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. పాత గొడవలు సర్దుమణుగుతాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీ కంపెనీలో పనిచేసే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోయి.. ఆరోగ్యం మెరుగుపడుతుంది.  

శని ఎఫెక్ట్‌తో కుంభ రాశి వారు శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగంలో ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు కొత్త దిశానిర్దేశం అందుకుంటారు. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులు విజయవంతమవుతాయి.  

శని చాలీసా, హనుమాన్ చాలీసా పఠిస్తే శనిదేవుని అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. అదేవిధంగా దానధర్మాలు, పేదలకు సహాయం చేసేవారిని శని దేవుడు ఎప్పుడూ ఇబ్బంది పెట్టడని అంటారు.       

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు ఆధారంగా రాసినది. ఈ సమాచారాన్ని జీ తెలుగు మీడియా ధృవీకరించలేదు.              

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link