Saudi Arabia Oil Reserves: సౌదీ అరేబియాకు జాక్‌పాట్, మరో 7 తరగని ఆయిల్ నిక్షేపాలు
ఇదే ప్రాంంతంలోని అసిక్రాలో మరో కొత్త గ్యాస్ నిక్షేపం బయటపడింది. ఇది రోజుకు 0.6 కోట్ల ఘనపు మీటర్లు ఉంటుంది. దాదాపుగా 100 బ్యారెళ్ల కండెన్స్డ్ ఆయిల్ వస్తోంది.
ఖాళీ ప్రాంతంలో రెండు కొత్త నేచురల్ గ్యాస్ నిక్షేపాలు లభించాయి. అల్ జహక్‌లోని అల్ అరబ్ సీ ప్రాంతంలో రోజుకు 5.3 ఘనపు మీటర్ల గ్యాస్ వస్తోంది. ఇదే బావి నుంచి మరో ప్రాంతంలో 1.1 కోట్లు ఘనపు మీటర్ల గ్యాస్ వస్తోంది. ఇక అల్ కతుఫ్ అనే ప్రాంతంలో ఉన్న అల్ కతుఫ్ -1 బావి నుంచి రోజుకు 7.6 కోట్ల ఘనపు మీటర్ల గ్యాస్ వస్తోంది. ఇక దాదాపు 40 బ్యారెళ్ల ఆయిల్ కూడా వస్తోంది.
సౌదీ అరేబియాలోని తూర్పు ప్రాంతంలో అల్ ఫారూక్ ప్రాంతంలో కూడా లైట్ ఆయిల్ వెలుగుచూసింది. అల్ ఫారూక్-4 బావి నుంచి రోజుకు 4557 బ్యారెల్స్ లైట్ ఆయిల్ వస్తోంది. దాంతోపాటు 3.79 ఘనపు మీటర్ల గ్యాస్ వస్తోంది. తూర్పు ప్రాంతంలోని మజాలిజ్ క్షేత్రంలో కొత్త ఆయిల్ నిక్షేపం బయటపడింది. మజాలిజ్ 62 బావి నుంచి రోజుకు 1780 బ్యారెళ్ల ఆయిల్ వస్తోంది. దాంతోపాటు 0.7 కోట్ల ఘనపు మీటర్ల గ్యాస్ వస్తోంది.
సౌదీ అరేబియా న్యూస్ రిపోర్ట్ ప్రకారం సౌదీలోని తూర్పు ప్రాంతంలో ఆయిల్ వెలికి తీసేందుకు రెండు కొత్త పద్ధతులు కనిపెట్టారు. ఒక లైట్ ఆయిల్ నిక్షేపం లభించింది. ఖాళీ ప్రాంతంలో నేచురల్ గ్యాస్ నిక్షేపాలు రెండు, గ్యాస్ నిక్షేపాలు రెండు లభించాయి. తూర్పు ప్రాంతంలో లదామ్ అనే ప్రాంతంలో భూమి కింద లైట్ ఆయిల్ వెలికితీసే కొత్త పద్ధతిని కనిపెట్టారు. అక్కడ లదామ్-2 బావి నుంచి రోజుకు 5100 బ్యారెల్స్ లైట్ ఆయిల్ వస్తోంది. దాంతోపాటు దాదాపుగా 4.9 కోట్ల ఘనపు మీటర్ల గ్యాస్ కూడా వస్తోంది.
ప్రపంచంలోని ఆయిల్ నిక్షేపాలకు కేరాఫ్ అంటే సౌదీ అరేబియా. ఇప్పుడీ దేశానికి మరో వరం లభించింది. దేశంలోని తూర్పు ప్రాంతంలోని ఖాళీ ప్రాంతాల్లో ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాల కోసం అణ్వే,షించాల్సిందిగా సౌదీ అరేబియా ఎనర్జీ శాఖ మంత్రి ఆదేశాలిచ్చారు. అరామ్ కో కంపెనీకు రెండు అంతులేని ఆయిల్ నిక్షేపాలు, రెండు గ్యాస్ నిక్షేపాలు ఇంకా చాలా లభ్యమైనట్టు సౌదీ ప్రిన్స్ అబ్లుల్ అజీజ్ తెలిపారు.