How to Save Money: డబ్బు ఎలా ఆదా చేయాలి..? ఈ సింపుల్ టిప్స్ పాటించండి

Sat, 28 Jan 2023-10:16 pm,

మీరు నెలకు రూ.10 వేలు సంపాదించినా.. రూ. లక్ష సంపాదించినా ప్రతి నెలా మీ జీతం నుంచి కొంత డబ్బును ఆదా చేయాలి. ఇందుకోసం ఫైనాన్స్‌కు సంబంధించిన మంచి అలవాట్లను అలవర్చుకోవాలి. ప్లాన్ ప్రకారం చెక్ లిస్ట్ సిద్ధం చేసుకోండి. ఏ పనికి ఎంత ఖర్చు చేయాలో ముందే రాసి పెట్టుకోండి. ఆ బడ్జెట్ ప్రకారమే ఖర్చు చేయండి.  

మీరు బడ్జెట్‌ను సిద్ధం చేస్తే.. దేనికి ఎంత ఖర్చు అవుతోంది పూర్తిగా స్పష్టత వస్తుంది. ఇంటి అద్దె, కిరాణా షాపు ఖర్చులు తగ్గించలేనివి. ఏదైనా అనవసరమైన కొనుగోలు, ఆన్‌లైన్‌లో రెగ్యులర్ ఫుడ్ ఆర్డర్ చేయడం వంటి ఇతర ఖర్చులను కచ్చితంగా తగ్గించుకోవచ్చు. ఇలాంటి వృథా ఖర్చులు తగ్గించుకోండి.  

మీరు అనేక కారణాల వల్ల రుణం తీసుకోవలసి రావచ్చు. అయితే లోన్ తీసుకునేప్పుడు ఎందుకోసం తీసుకుంటున్నారో ఆలోచించుకోండి. తాత్కాలిక పరిష్కారం కోసం లోన్ తీసుకోకండి. హౌస్ లోన్, విద్యా రుణాలు జీవితంలో కొన్ని లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడతాయి. మీరు ఎప్పుడు రుణం తీసుకున్నా.. తెలివిగా తీసుకోండి.  

ఒక ఉద్దేశంతో డబ్బు సేవ్ చేసుకోండి. మీరు దేని కోసం పొదుపు చేస్తున్నారో మీకు తెలియకపోతే.. తరువాత ఖర్చు చేయవచ్చు. మీరు పొదుపు చేయడానికి సరైన లక్ష్యం ఉంటే.. పొదుపు చేస్తున్నప్పుడు ఓ కిక్ వస్తుంది. ఇది మీ పురోగతిని ట్రాక్ చేయడాన్ని కూడా సులభతరం చేస్తుంది. మీరు లక్ష్యానికి చేరువ అవుతున్నారని మీరు భావించినప్పుడు.. ప్రతి నెలా ఎక్కువ పొదుపు చేసేందుకు వీలవుతుంది.

మీరు ఎక్కడి నుంచైనా అదనపు ఆదాయాన్ని పొందినట్లయితే.. ఈ మొత్తాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. మీరు మొత్తం ఖర్చు చేయడానికి బదులు ఈ మొత్తంలో కనీసం కొంత భాగాన్ని ఆదా చేస్తే మీ భవిష్యత్‌కు ఉపయోగపడుతుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link