Shivratri sawan 2024: శ్రావణ శివరాత్రి.. శివుడు, శనిగ్రహం అనుగ్రహంతో ఈ రాశులకు డబ్బే డబ్బు..

Thu, 01 Aug 2024-8:54 pm,

శ్రావణ శివరాత్రిని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. శివుడ్ని భక్తులు భోలా  శంకరుడు అంటారు. చెంబు నిండా నీళ్లు  పోసి, బిల్వపత్రి వేస్తే ఆయన మన కోరికలన్ని నెరవేరుస్తాడంటారు.  అందుకే చాలా మంది శివుడ్ని ఎక్కువగా పూజిస్తారు. 

శనిదేవుడిని కర్మదేవత అంటారు. ఆయన మనం చేసే పనుల్ని బట్టి ఫలితాలు ఇస్తుంటారు. అందుకే చెడు పనులు కానీ చెడు  ఆలోచనలు కానీ చేయకూడదని చెప్తుంటారు. ఈ నేపథ్యంలో.. శ్రావణ శివరాత్రి అనేది ఈసారి ఆగస్టు 2 న ఏర్పడుతుంది. దీన్ని భక్తులు భక్తితో జరుపుకుంటారు.  దీని వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని విధంగా ధనలాభం కల్గనుంది.  

మేష రాశి .. ఈ రాశి వారు శివుడు, శనిదేవుల అనుగ్రహం వల్ల ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఇప్పటి దాక రాదనుకున్న డబ్బు వచ్చి చేరుతుంది. నచ్చిన అమ్మాయితో పెళ్లికుదురుతుంది. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు.

కన్య రాశి.. ఈ రాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. స్నేహితులలో కలసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. విదేశాలకు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లకు చాన్స్ ఉంది. అన్నిరకాలుగా ఈ ఏడాదంతా కలిసి వస్తుంది.

తుల రాశి .. ఈ రాశి వారికి శివుడు, శనిదేవుళ్ల అనుగ్రహం వల్ల.. కోర్టు కేసులో పరిష్కారమౌతాయి. పెద్ద ప్రమాదం నుంచి బైటపడతారు. లాటరీలు తగిలే చాన్సులు కన్పిస్తున్నాయి. తోబుట్టువుల వారు సహాయ సహాకారాలు అందిస్తారు. నచ్చిన అమ్మాయితో పెళ్లి సంబంధం కుదురుతుంది. 

ధనస్సు... ఈ రాశివారు ఈ సమయంలో నక్క తోకను తొక్కినట్లు అని చెప్పుకొవచ్చు.ఏపని చేపట్టిన కూడా దానిలో విజయం సాధిస్తారు. కొత్త ఇళ్లును కోనుగోలు చేస్తారు. భార్యవైపు నుంచి ఆస్తులు మీ సొంత మౌతాయి. దగ్గరి సంబంధం వారితో పెళ్లికుదిరే అవకాశం ఉంటుంది.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link