SBI గుడ్ న్యూస్.. ఇకనుంచి వారికి ఇంటి వద్దకే బ్యాంక్ సేవలు
భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank Of India) తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. మీకు ఎస్‌బీఐలో ఖాతా ఉందా.. అయితే మీరు ఎంచక్కా ఇంటి వద్దనే SBI సేవలు పొందవచ్చు. ఇకనుంచి మీరు ప్రతి పనికి బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదు.
Also Read: SBI Credit Card Limit: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవాలని ఉందా.. ఇది చదవండి
క్యాష్ పికప్, క్యాష్ డెలివరీ, చెక్ బుక్ లాంటి ఎస్‌బీఐ బ్యాంకు సేవలను డోర్ డెలివరీ సర్వీస్‌గా మార్చింది. వీటితో పాటు డిమాండ్ డ్రాఫ్ట్(Demand Draft), పే ఆర్డర్, లైఫ్ సర్టిఫికెట్, కైవైసీ డాక్యుమెంట్స్ పికప్, ఫామ్ 15 పికప్, డ్రాఫ్ట్ డెలివరీ వంటి ఎన్నో సేవల్ని తమ ఖాతాదారులు ఇంటివద్దనే పొందేలా చేస్తోంది బ్యాంకింగ్స్ దిగ్జజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI).
SBI అందిస్తున్న డోర్ డెలివరీ సర్వీస్ ద్వారా ఖాతాదారుడు ఒకరోజుకు కనిష్టంగా రూ.1000, గరిష్టంగా 20,000 రూపాయల వరకు నగదును ఇంటి వద్ద పొందవచ్చు. ఈ సేవలు ప్రతి ఒక్కరికి కాదు, కేవలం వికలాంగులు, 70 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవల్ని అందించనుంది.
Also Read: Secured Credit Card: మీతో సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ ఉందా? ఇవి ఎవరికి ఇస్తారో తెలుసా!
70ఏళ్లకు పైబడిన వారు, వికలాంగ కస్టమర్లకు డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ఎస్‌బీఐ ఉద్యోగి ఇంటికి వస్తాడు. కానీ, మైనర్ బ్యాంక్ అకౌంట్లు, జాయింట్ అకౌంట్ ఖాతాదారులకు ఈ సేవలు అందించలేమని బ్యాంకు స్పష్టం చేసింది. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎస్‌బీఐ తీసుకొచ్చిన కొత్త సర్వీసులపై ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాల్ చేసి ఎస్‌బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవల్ని పొందచ్చు. బ్యాంక్ పనివేళల్లో 1800111103 నెంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది. మరియు బ్యాంక్ మొబైల్ యాప్, వెబ్‌సైట్ లేదా కాల్ సెంటర్ ద్వారా ఎస్‌బీఐ అందిస్తున్న ఇంటి వద్దకే సర్వీసును వినియోగించుకోవచ్చు.
Also Read: LPG Cylinder Price Hike: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు.. తాజా ధరలు ఇలా!