SBI Sahaj Loan: SBI బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 15 నిమిషాల్లోనే ప్రతి ఒక్కరికీ రూ.5 కోట్ల లోన్ సౌకర్యం..
చిన్న మధ్యతరగతి పరిశ్రమలను స్థాపించుకునే తమ కస్టమర్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రుణ సౌకర్యాన్ని అందించబోతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ SBI సహజ్ లోన్ పథకం ద్వారా రూ. ఐదు కోట్ల వరకు లోన్ ను అందించబోతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఐదు కోట్ల పాటు రుణాన్ని తీసుకునే వారికి MSME సహజ్ లోన్ పథకం ద్వారా సాంక్షన్ చేయబోతున్నట్లు తెలిపింది.
MSME సహజ్ ఇన్ వాయిస్ ఫైనాన్సింగ్ పథకం ద్వారా బ్యాంకుకు వెళ్లకుండానే వ్యాపారస్తులకు దాదాపు 15 నిమిషాల్లోనే రుణ సౌకర్యాన్ని అందిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే ఈ దరఖాస్తు చేయడానికి దాదాపు 15 నిమిషాల పాటు సమయం పడుతుందని వెల్లడించింది. ఈ దరఖాస్తు చేసిన వెంటనే ఎస్బిఐ ద్వారా డిజిటల్ ఆమోదం పొందితే దాదాపు 15 నిమిషాల్లోనే రుణం అందబోతోంది.
ఈ పథకంపై ఎస్బిఐ బ్యాంకు చైర్మన్ ఎస్ శెట్టి మీడియాతో మాట్లాడుతూ.. పథకం గురించి ఇలా వివరించారు.. భారత్లోని వ్యాపారాలు మెరుగుపరచడానికి రూ. 5 రుణాన్ని అందించబోతున్నట్లు ఆయన తెలిపారు. అయితే దీనికోసం బ్యాంకు సంబంధిత MSME అధికారులను సంప్రదించి వారి రుణం పొందాలనుకునే వారి పాన్ కార్డ్, ఇతని డీటెయిల్స్ చెల్లిస్తే కేవలం 15 నిమిషాల్లోనే రుణం ఆమోదం పొందే సదుపాయాన్ని అందించామని తెలిపారు.
ఈ దీన్ని బట్టి చూస్తే భారత్లోని ఎస్బిఐ బ్యాంక్ ఖాతా కలిగిన చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరు సులభంగా ఈ పథకం ద్వారా రుణాన్ని పొంది ఎక్కువ మోతాదులో పెట్టుబడులు పెట్టవచ్చు. దీని కారణంగా వారు ఆర్థికంగా అభివృద్ధి చెంది, దేశాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తారని భావనతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ఆర్బిఐ తెలిపింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా MSME లకు సంబంధించిన రుణాలపై అధిక ప్రాధాన్యత చూపుతోందని.. అలాగే ఈ రుణాలను మధ్యతరగతి ప్రజలు కూడా సులభంగా తీసుకునే ఫెసిలిటీ అందిస్తోంది. అలాగే ఈ రుణాలను తిరిగి చెల్లించే వారికి ఎప్పటికప్పుడు కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలను కూడా అందించబోతున్నట్లు ఎస్బిఐ తెలిపింది.
ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రోత్సాహంతో ఈ సంవత్సరం 600 కంటే ఎక్కువ ఎస్బిఐ బ్యాంకుకు సంబంధించిన శాఖలను విస్తరించినట్లు తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ శాఖలు 22,000 పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ బ్యాంకు 50 కోట్ల మందికిపైగా సేవలందిస్తున్నట్లు తెలుస్తోంది.