SBI Scheme: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇలా చేస్తే రూ. 20,00,000 పొందే సువర్ణావకాశం..!
సాధారణంగా మనం బ్యాంకుల్లో డబ్బు భద్రంగా ఉంటుంది. గ్యారంటీ రిటర్న్, వడ్డీతోపాటు పొందవచ్చని డిపాజిట్ చేసుకుంటాం. ఎస్‌బీఐ ఖాతాదారులకు బంపర్ ఆఫర్. వడ్డీరేటు 7 నుంచి 10 ఏళ్ల వరకు డిపాజిట్ చేస్తే ఆకర్షణీయమైన వడ్డీ పొందే అవకాశం లభిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్‌డీ స్కీమ్ ద్వారా గరిష్ట పెట్టుబడులకు ముఖ్యంగా సీనియర్ సిటిజెన్లు డబ్బు డిపాజిట్ చేస్తే డబుల్ బెనిఫిట్ పొందే అవకాశం లభిస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 10 లక్షలు డిపాజిట్ చేస్తే పదేళ్లకు రూ. 19,05,559 అసలు, వడ్డీ రేటు రెండూ కలిసి వస్తాయి. ఇది 6.5 శాతం వడ్డీకి. ఇన్నేళ్లకు రూ. 9,05,559 వడ్డీ పొందుతారు. అంటే అసలు, వడ్డీ రెండూ కలిపి నిర్ధిష్ట కాలంలో డబుల్ అవుతుంది.
సీనియర్ సిటిజెన్లకు రూ. 10 లక్షలు డిపాజిట్ చేస్తే పదేళ్లకు ఎఫ్‌డీపై ఎంత వస్తుందో తెలుసుకుందాం. సీనియర్ సిటిజెన్లకు 7.5 శాతం వడ్డీతో అయితే, రూ. 21,02,349 మెచ్యూరిటీ సమయానికి పొందుతారు. అంటే వీరికి డబుల్ కంటే ఎక్కువ ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది.
ముఖ్యంగా ఈ ఎఫ్‌డీ స్కీమ్ ఎంతో భద్రమైంది. ఐదేళ్ల వరకు ఎటువంటి ట్యాక్స్ కూడా ఉండదు. సెక్షన్ 80 సీ ప్రకారం ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. కానీ, ఇందులో మీరు తీసుకునే వడ్డీపై కాస్త ట్యాక్స్ కట్టింగ్ ఉంటుంది.
ఇన్‌కాం ట్యాక్స్ రూల్స్, ట్యాక్స్ డిడక్షన్ (TDS) ఎఫ్‌డీ స్కీమ్‌పై వర్తిస్తుంది. ఇది మెచ్చూరిటీ సమయానికి శ్లాబ్ రేట్‌పై వర్తిస్తుంది.