AP Schools reopen: ఆంధ్రప్రదేశ్‌లో తెరుచుకున్న పాఠశాలలు.. ఫొటోలు
మార్చిలో విధించిన లాక్‌డౌన్ నాటినుంచి దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతబడిన విషయం తెలిసిందే. అయితే.. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో దశలవారీగా స్కూళ్లను తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రంలో దాదాపు 7నెలల నుంచి మూతబడిన స్కూళ్లు కోవిడ్ నిబంధనలతో సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రతీ తరగతి విద్యార్థులకు శానిటైజ్ చేసుకునేందుకు 15 నిమిషాల సమయం ఇస్తున్నారు.
మూడు దశల్లో విద్యాసంస్థలను ప్రారంభించేందకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2వ తేదీ నుంచి 9, 10, 11, 12 తరగతులకు ఒక రోజు తర్వాత ఒకరోజు అది కూడా ఒక్క పూట తరగతులను నిర్వహించనున్నారు.
నవంబర్ 23వ తేదీ నుంచి 6,7,8వ తరగతి విద్యార్థులకు తరగతులు జరగనున్నాయి. దీంతోపాటు ఒకటి నుంచి అయిదో తరగతి విద్యార్థులకు డిసెంబర్ 14వ తేదీ నుంచి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం క్లాసులు జరగనున్నాయి.