Twin Tower Attacks:సెప్టెంబర్ 11 దాడులకు 20 ఏళ్లు...నాడు ఏం జరిగింది..ఎలా జరిగింది

Sat, 11 Sep 2021-2:38 pm,

11 ఎకరాల విస్తీర్ణంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్‌ను వైమానిక దాడులతో బూడిద చేసిన వైనం. దాదాపు 5 వేలమంది మృత్యువాత పడ్డారు. అమెరికా చరిత్రలో అతిపెద్ద మారణకాండగా వర్ణించే  ఈ దాడుల వెనుక అల్ ఖైదా హస్తముందనేది నిరూపితమైంది. ఇజ్రాయిల్‌తో అమెరికా స్నేహం, సోమాలియా, మోరో అంతర్యుద్ధం, రష్యా, లెబనాన్, కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు, ముస్లింల అణచివేత, ఇస్లాం వ్యతిరేక కుట్రలకు అమెరికా వత్తాసు పలుకుతుందనేది అల్‌ఖైదా ప్రధాన ఆరోపణ. సౌదీ అరేబియా నుంచి యూఎస్ భద్రతా దళాల మొహరింపు, ఇరాక్‌కు వ్యతిరేకంగా అంక్షలు వంటివి కూడా ప్రధాన కారణాలని అల్‌ఖైదా వాదనగా ఉంది. 

విమానంలో నడపడంలో శిక్షణ పొందిన 19 మంది ఉగ్రవాదులు 5 మంది చొప్పున మూడు గ్రూపులు, మరో నలుగురు ఒక గ్రూప్‌గా విడిపోయారు. సెప్టెంబర్ 11వ తేదీన నాలుగు విమానాలన్ని హైజాక్ చేశారు. మొదటి ఫ్లైట్ అమెరికన్ ఎయిర్‌లైన్స్ 11 తో ఉదయం 8 గంటల 46 నిమిషాలకు మాన్ హట్టన్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్‌టవర్ ఢీ కొట్టారు. 

17 నిమిషాల వ్యవధిలో రెండో విమానం యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 175 సౌత్ టవర్‌ని ఢీ కొట్టింది. కేవలం గంటా నలభై రెండు నిమిషాల్లో 110 అంతస్థుల ట్విన్‌టవర్స్ కళ్లముందే కుప్పకూలిపోయాయి. మంటలు, దట్టమైన పొగ, ఆర్తనాదాలు, ప్రాణభీతితో పైనుంచి దూకేసిన జనం అన్నీ కెమేరాల్లో రికార్డయ్యాయి. రెండు కిలోమీటర్ల మేర భవనాలు నాశనమయ్యాయి.

ఇక మూడవ దాడి అదే రోజు పెంటగాన్ పశ్చిమ భాగాన్ని ఉదయం 9 గంటల 37 నిమిషాలకు జరిగింది. డల్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన విమానాన్ని ఓహియో వద్ద హైజాక్ చేశారు తీవ్రవాదులు. ఇక నాలుగవ విమానం ఉదయం 10 గంటల 3 నిమిషాలకు పెన్సిల్వేనియాలోని మైదానాల్లో క్రాష్‌ల్యాండ్ అయింది. ఈ విమానం యూఎస్ పార్లమెంట్ భవనం లక్ష్యంగా వచ్చినట్టు అంచనా. 

సెప్టెంబర్ 11 దాడుల అనంతరం ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులొచ్చాయి. ఆసియన్ దేశాల విషయంలో పాశ్చాత్య దేశాల ధోరణి పూర్తిగా మారిపోయింది. ట్రావెల్ బ్యాన్ ఆంక్షలు, మత విద్వేషదాడుకు పెరిగిపోయాయి. దాడులకు బిన్ లాడెన్ కారణంగా భావించి..అతడి కోసం అణ్వేషణ సాగింది. 

చివరికి అంటే దాడులు జరిగిన పదేళ్ల అనంతరం 2001 మే 1న పాకిస్తాన్‌లో అమెరికా సైన్యం నిర్వహించిన ఆపరేషన్ నెఫ్ట్యూన్ స్పియర్‌లో లాడెన్ హతమైనట్టు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వెల్లడించారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link