Shah Rukh Tirumala Diclaration: షారుఖ్ తిరుమల శ్రీవారి దర్శనానికి ఇచ్చిన డిక్లరేషన్.. సోషల్ మీడియాలో వైరల్..
ప్రస్తుతం తిరుమల వ్యవహారం ఏపీ రాజకీయాలతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు తిరుమలతో పాటు దేశంలోని ఆలయాల పవిత్రతను కాపాడటం కోసం సాధు సంతులు, పండితులతో సనాతన ధర్మ పరిషత్ వంటి ఓ బోర్డ్ ఏర్పాటు చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు.
మరోవైపు తిరుమల లడ్డూ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వం చేసిన దుశ్చర్యల కారణంగా లడ్డూ ప్రసాదం అపవిత్రమైందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సాక్ష్యాలతో సహా బయటపెట్డారు. ఈ నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి తిరుమల లడ్డూ వ్యవహారంలో మాకు ఎటువంటి సంబంధం లేదు. కావాలనే మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రతిదాడి చేసారు.
ఈ సందర్బంగా తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవడానికి తిరుమల దర్శనానికి వస్తున్నట్టు జగన్ ప్రకటించడం సంచలనం అయింది. అయితే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నేతలు మాత్రం తిరుమలకు వెంకన్న స్వామిపై భక్తి, విశ్వాసం ఉన్నట్టు డిక్లరేషన్ పత్రం సంతకం చేయాలని పట్టుపట్టాయి. దీంతో జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు.
తాజాగా ఈ సంఘటనల తర్వాత షారుఖ్ .. అప్పట్లో తన జవాన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా తన టీమ్ మెంబర్స్ తో పాటు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
దర్శనం చేసుకునే ముందు అన్యమతస్తులు తమకు స్వామి వారిపై భక్తి, విశ్వాసం, ఉన్నాయని చెబుతూ డిక్లరేషన్ పై సంతకం పెట్టిన డాక్యమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కూటమి నేతలు.. షారుఖ్ సహా అన్య మతస్తులు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునే ముందు స్వామి పై తమకు అచంచెల విశ్వాసం ఉందంటూ సంతకం పెట్టడం ఎప్పటి నుంచో ఉంది.
మరి ఏపీకి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జగన్ ఎందుకు తిరుమల స్వామి భక్తి ఉన్నట్టు సంతకం చేయరు అని ఏపీ ప్రభుత్వ పెద్దలతో పాటు సామాన్య భక్తులు ప్రశ్నిస్తున్నారు. అపుడెపుడో లేనిది ఇపుడు సంతకం పెట్టాల్సిన అవసరం ఏమిటనేది వైసీపీ నేతలు తమ వాదనను ముందుకు తెస్తున్నారు. ఏది ఏమైనా జగన్ తిరుమల డిక్లరేషన్ ఫామ్ పై సంతకం పెట్టకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.