Lord Shanidev: కొత్త ఏడాదికి ముందే శనీశ్వరుడి ప్రభంజనం.. ఈ రాశుల వారు ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టబోతున్నారు.. మీరున్నారా..?
శనీశ్వరుడు సూర్యుడు, ఛాయాదేవీల పుత్రుడు. యమధర్మరాజు సోదరుడు. అయితే.. శనీశ్వరుడు మనిషి చేసుకున్న మంచి, చెడు కర్మల ఆధారణంగా ఫలితాలను ఇస్తాడని చెప్తుంటారు. మార్గశిర మాసంలో శనీశ్వరుడ్ని విశేషంగా పూజించాలని చెప్తుంటారు. మెయిన్ గా ఏలినాటి శని,సాడేసాతితో బాధపడుతున్న వారు.. శనివారం రోజున కొన్ని పరిహారాలు పాటించాలని చెప్తుంటారు.
శనీశ్వరుడికి నల్లని పదార్థాలు, వస్తువులు అంటే ఇష్టమంట. అందుకే శనీశ్వరుడి అనుగ్రహాం కోసం.. నల్ల నువ్వులు, నల్లని బట్ట, నల్లని రంగు గల పండ్లు దానంగా ఇవ్వాలంట.
అదే విధంగా శనీశ్వరుడు నపుంసకులకు ఏదైన దానం చేస్తే ప్రీతిచెందుతాడంట. అందుకే శనివారం రోజున వారికి తోచిన పండ్లు, ఫలాలను దానంగా ఇవ్వాలంటారు. మరొవైపు శనీకి తైలాభిషేకం కూడా చేయిస్తే మంచి జరుగుతుందంట.
ముఖ్యంగా శనీశ్వరుడు కొన్ని రాశుల వారికి ఆంగ్ర ఏడాది ప్రారంభంకు ముందే శుభఫలితాలు ఇస్తున్నాడంట. అవేంటంటే.. మకరం..ఈ రాశివారు ముఖ్యంగా కోర్టుకేసుల్లో విజయాలు సాధిస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి.
కన్య రాశి.. వీరు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు కన్పిస్తున్నాయి. భార్య తరపు ఆస్తులు మీ సొంతమౌతాయి. మీతో సహాయం పొంది ముఖం చాటేసిన వారు.. మరల మీ దగ్గరకు వస్తారు.
తుల రాశి.. వీరికి విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి. పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొవచ్చు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తు ఒక సమస్య నుంచిపరిష్కారం లభిస్తుంది. అదే విధంగా శనివారం రోజున పైవిధంగా పరిహారాలు పాటిస్తే.. మరిన్ని మంచి ఫలితాలు పొందవచ్చని పండితులు చేప్తున్నారు.