Shani Dev: త్వరలోనే శని గ్రహం కదలికలు.. మే 12వ తేదీ నుంచి ఈ రాశుల వారికి నిత్యం పండగే..

Wed, 08 May 2024-10:41 pm,

శని గ్రహం ప్రస్తుతం కుంభ రాశిలో సంచార క్రమంలో ఉంది ఏప్రిల్ 6న నక్షత్ర సంచారం కూడా చేసింది. ఆ తర్వాత మే 12వ తేదీన మరోసారి నక్షత్ర సంచారం చేయబోతోంది. ఈ సంచార ప్రభావం ఆగస్టు 18 వ తేదీ వరకు కొనసాగుతుంది.  

శని గ్రహం నక్షత్ర సంచారం చేయడంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో శుభ ఘడియలు ప్రారంభమవుతాయి. అయితే మరికొన్ని రాశుల వారి జీవితాల్లో మాత్రం అనేక దుష్ప్రభావాలు మొదలయ్యే ఛాన్స్ ఉంది.  

మే 12వ తేదీన జరగబోయే శని గ్రహ నక్షత్ర సంచారం ఏయే రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుందో.. ఏయే రాశుల వారికి ఆశుభ ఫలితాలను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.  

శని గ్రహం నక్షత్ర సంచారం చేయడం కారణంగా మేష రాశి వారికి మే 12వ తేదీ నుంచి అపార ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి నిలిచిపోయిన డబ్బులు కూడా సులభంగా తిరిగి వస్తాయి. సంపాదన ఆస్తులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే సమాజంలో పేరు ప్రతిష్టలు కీర్తి రెట్టింపు అవుతాయి.   

కన్యా రాశి వారికి శని గ్రహ సంచారంతో అనేక రకాల ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి పెండింగ్లో ఉన్న పనులన్నీ సులభంగా పూర్తి అవుతాయి. కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది. అలాగే ఇప్పటికే ఉద్యోగాల్లో మంచి ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నవారికి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. జీవితంలో సంతోషం ఆనందం రెట్టింపు అవుతుంది.  

   శని పాలించే కుంభ రాశి వారిపై కూడా ప్రత్యక్షమైన ప్రభావం పడుతుంది. దీని కారణంగా వీరికి విపరీతమైన ధన లాభాలు కలగడమే, కాకుండా జీవితంలో వస్తున్న వైవాహిక సమస్యలు పరిష్కారమవుతాయి. దీంతోపాటు ఉద్యోగాల్లో మార్పులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. పనుల్లో వస్తున్న ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి. వ్యాపారాలు కూడా వీరికి అనుకూలంగా మారుతాయి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link