Shani Dev Transit: 2025లో ఈ రాశులపై శని దేవుడి అశుభ దృష్టి పూర్తిగా తొలిగింపు.. వీరికి మాత్రం తిరుగులేని అదృష్టం..
Shani Dev Transit: ప్రస్తుతం నవగ్రహాల్లో శని దేవుడు కుంభ రాశిలోకి సంచరిస్తున్నాడు. అంతేకాదు వచ్చే 2025లో మీన రాశిలోకి ప్రవేశించబోతున్నారు. దీంతో కొన్ని రోజులుగా కష్టాలు అనుభవిస్తున్న ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులతో పాటు తిరుగులేని అదృష్టంతో పాటు ధన యోగం ప్రాప్తించబోతుంది.
మకర రాశి : శనిదేవుడు రాశి సంచారం వలన మకర రాశి వారికి అనుకూలంగా పరిణమించబోతుంది. అంతేకాదు ఈ రాశి వారి చిరకాల కోరిక నెరవేరబోతుంది. అంతేకాదు జీవిత భాగస్వామితో గత కొన్ని రోజులుగా ఉన్న మనస్పర్థలు తొలిగిపోతాయి. స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఆదాయం పెరుగుతోంది. పెద్దలకు సంబంధించిన ఆస్తులు కలిసొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ధనుస్సు రాశి: శనీశ్వరుడు రాశి మార్పు వలన ధనుస్సు రాశి వారి లైఫ్ లో గత కొన్నేళ్లుగా ఎదుర్కొన్న సవాళ్లు పటాపంచలు అవుతాయి. అయితే శని దేవుడు అనుగ్రహంతో అన్ని సర్దుకుపోతున్నారు. ప్రశాంతమైన జీవితం గడుపుతారు. ఆదాయంలో స్థిరత్వం వస్తుంది. ఆర్థిక సంక్షోభం నుండి బయట పడతారు.
వృషభ రాశి: నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ఆశీర్వాదం ఉంటే అన్ని సర్దుకుంటాయి. శనిదేవుడు రాశి మార్పు వృషభ రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. ఈ రాశి వారు భారీ ఆర్థిక లాభాలను అందకుంటారు. జీవితంలో పొదపు పాటిస్తారు. కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. అంతేకాదు ఆర్థిక సమస్యల నుండి బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుటుంబ జీవితంలో సామరస్యంతో సాగిపోతుంది.
తులా రాశి: శనిదేవుడు మీన రాశి ప్రవేశం వలన తులా రాశి వారికి మహర్దశ పట్టనుంది. ముఖ్యంగా వ్యక్తిగత, వృత్తి జీవితంలో పురోగతిని సాధిస్తారు. ఉద్యోగార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అంతేకాదు పూర్వీకులకు సంబంధించిన ఆస్తితో పాటు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతుంది. వ్యవస్థాపకులకు బంపర్ ఆదాయంతో పాటు, మీ వ్యాపారాన్ని విస్తరించడానికి అనుకూలమైన వాతావరణం కూడా ఉంటుంది.
గమనిక : ఇక్కడ మేము అందించిన సమాచారం ఇంటర్నెట్ తో పాటు జ్యోతిషశాస్త్ర పండితులు చెప్పిన అభిప్రాయాలను మాత్రమే మేము ప్రస్తావించాము. దీన్ని ZEE 24 గంటలు నిర్ధారించడం లేదు.