Shani Dev Vakri: మరో 6 నెలలు ఈ రాశుల వారిపై శని దేవుడి అశుభ దృష్టి.. ఈ పరిహారాలు పాటిస్తే అంతా శుభమే..

Sat, 19 Oct 2024-8:44 am,

Shani Dev Vakri: జ్యోతిష్య శాస్త్రంలో  శని దేవుడు న్యాయ దేవుడిగా పిలుస్తుంటారు. ఎవరి చేసే కర్మలను బట్టి వారికి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. శని దేవుడు ఒక రాశిలో రెండున్నరేళ్లపాటు ఉండి ఆ వ్యక్తికి చేసిన మంచి చెడులను  బట్టి ఫలితాలు ఇస్తుంటాడు. శని దేవుడు ప్రతి రాశిలో ఉండటం వలన కొన్ని రాశుల వారికి ఏల్నాటి శని  ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం వని వక్ర గమనంలో ఉండటం వలన ఈ మూడు రాశుల శారు అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

కుంభరాశిలో శని సంచారం వలన 5 రాశుల వారు ఏల్నాటి శని ప్రభావంతో పాటు అష్టమ శని,అర్ధాష్టమ శని ఫలితాలను ఎదుర్కొంటున్నారు.   ప్రస్తుతం శని దేవుడు 3 రాశుల మీద  చెడు దృష్టిని కలిగి ఉన్నాడు.  దీంతో ఆయా రాశుల వారికీ ఆర్థిక నష్టం, అనవసరమైన వివాదాలు, చేసే పనిలో ఒత్తిడి వంటివి వారికి  అడ్డంకులుగా మారుతాయి.

నవంబర్ 2024లో శని వక్రం నుంచి ప్రత్యక్షంగా కదలబోతున్నాడు.  శని మార్చి 2025లో మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడే ఈ వ్యక్తులు కొంత అప్పటి వరకు పడుతన్న బాధల నుంచి ఉపశమనం పొందుతారు. ఈ 3 రాశులు ఏమిటో తెలుసుకోండి.

 

మేష రాశి.. మేష రాశి వారు ఈ కాలంలో చాలా అప్రమత్తంగా మెలగాలి. లేకుంటే భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. శత్రువులు మీపై పై చేయి సాధించే అవకాశాలున్నాయి. అవసర ప్రయాణాలను రద్దు చేసుకోవడం ఉత్తమం. చేసే ప్రతి పనిలో అప్రమత్తత అవసరం. 

కన్యా రాశి..

శని దేవుడు కన్యా రాశి వారిపై అశుభ  దృష్టిని కలిగి ఉంది. దీంతో ఈ సమయంలో ఈ రాశుల వారి  వ్యక్తుల జీవితాల్లో పెను మార్పులు సంభవించనున్నాయి. వ్యాపారస్తులు ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరి పెట్టుబడులు పెడితే మంచిది.  లేకపోతే ఆర్ధిక పరమైన ఇబ్బందులను ఫేస్  చేయవచ్చు.

మకర రాశి.. మకర రాశి పై శని దేవుడు అశుభ దృష్టి ఉంది. త్వరలో వీళ్లు అనుభవిస్తున్న ఏల్నాటి శని మార్చి నాటికి తొలిగిపోతుంది. ఈ ఆరు నెలలు ఈ రాశుల వ్యక్తులు చేసే పనిలో శ్రద్ధ పెట్టాలి. ప్రతి పని మీకు చికాకు కలిగించవచ్చు. మీ కెరీర్ లో సవాళ్లను ఎదుర్కుంటారు. ఎవరితో అనవసరంగా మాట్లాడవద్దు.

ఈ మూడు రాశుల వారు ప్రతి శనివారం .. నవగ్రహాలున్న ఆలయానికి వెళ్లి.. మూడు లేదా 9 ప్రదక్షిణలు చేయండి. నల్ల బట్ట, నల్ల నువ్వులు, నూనెతో శనికి తైలాభిషేకం చేయండి. శని వారం పేద వాళ్ల బట్టలు లేదా ఆహారం దానం ఇస్తే శని దేవుడు తీక్షణ దృష్టి మీపై తగ్గుతుంది.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, ఇంటర్నెట్, జ్యోతిష్యులు ప్రస్తావించిన అంశాలనే మేము ఇక్కడ సమాచారంగా ఇచ్చాము.  ZEE NEWS దీనిని ధృవీకరించడం లేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link