Shani Gochar: రాహు నక్షత్రంలో శనిదేవుడి అత్యంత శక్తివంతమైన యోగం.. ఈ రాశుల వారికి రాజయోగమే..
Shani Dev Transit: ప్రస్తుతం నవగ్రహాల్లో పవర్ ఫుల్ అయిన శనీశ్వరుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శని ప్రస్తుతం వక్ర గమనంలో ఉన్నాడు. శని ఈ యేడాది మొత్తం కుంభంలోని సంచరించబోతున్నాడు. ఇక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శని దేవుడి గమనం పన్నెండు రాశలను తీవ్ర ప్రభావితం చేస్తుంది.
వచ్చే నెలలో శని దేవుడు రాహువు నక్షత్రంలో ప్రవేశించడం వలన 7 రాశుల వారిపై మంచి ప్రభావం చూపించబోతున్నాడు. అంతేకాదు గత కొన్నేళ్లుగా ఆయా రాశులపై ఉన్న శని దేవుడి అశుభ దృష్టి తొలిగిపోనుంది
మేష రాశి.. శని దేవుడు రాహువు సంచారం వలన మేష రాశి వారిపై శని దేవుడి అనుగ్రహం ఉండబోతుంది. త్వరలో ఈ రాశి వారికి ఏల్నాటి శని ప్రారంభమైన ఆ ప్రభావం కాస్తంత తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వివాహా యోగం ఉండనుంది.
మిథున రాశి.. శనీశ్వరుడిని రాహువు నక్షత్ర సంచారం వలన మిథున రాశి వారి జీవితం బంగారు మయంగా మారబోతుంది. కొత్తగా లైఫ్ ను స్టార్ట్ చేస్తారు. ఉద్యోగంలో పదోన్నతి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతుంది.
సింహ రాశి.. సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. మొత్తంగా గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న డబ్బు చేతికి అందుతుంది. శతృవులపై విజయం సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతి అభించే అవకాశాలున్నాయి.
కన్య రాశి.. శని దేవుడు రాహు నక్షత్ర సంచారం వలన ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. శని దేవుడు సప్తమ స్థానంలో ఉన్న అనుకూల ఫలితాలు ఉండును. మాతృ లేదా పితృ పూర్వీకులకు సంబంధించిన ఆస్తులు కలిసొచ్చే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉన్నాయి.
తుల రాశి.. తులా రాశి వారికి శనీశ్వరుడి రాహు గ్రహ సంచారం వలన గత కొన్ని రోజులు అనుభవిస్తున్న కష్టాలు తొలిగిపోతాయి. ఆకస్మిక ధనలాభం, ఉద్యోగంలో పై బాస్ నుండి చికాకులు తొలిగిపోతాయి. జీవితం ఉన్నతంగా ఉండబోతుంది.
మకర రాశి.. ప్రస్తుతం మకర రాశి వారికి ఏల్నాటి శని చివరి దశలో ఉంది. పైగా మకరం శనీ స్వక్షేత్రం, మరియు రాహువు మిత్ర గ్రహం కారణంగా శనీ దేవుడి అపార కరుణా వీక్షణాలు ఈ రాశిపై ఉండనున్నాయి. దీంతో జీవితంలో సాధించాల్సిన పనులు ఈ కాలంలో నెరవేరుతాయి. రాజకీయంగా ఉన్నతంగా ఉంటుంది.
కుంభ రాశి.. కుంభ రాశి వారికి ఈ సమయంలో పరీక్ష కాలంగా ఉన్నా.. శని స్వక్షేత్రం కారణంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. విద్యార్ధులు పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశాలున్నాయి. పోటీ పరీక్షలు రాసేవారికీ కలిసొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అవకాశాలు రానున్నాయి.
గమనిక : ఇక్కడ అందించబడిన సమాచారం సాధారణ అభిప్రాయాలు మరియు విలువలను కలిగి ఉంది. ZEE NEWS దీన్ని ధృవీకరించడం లేదు.