Shani Margi 2024: నవంబర్ 15 నుంచి శని మార్గి ప్రభావం, 5 రాశులకు ఊహించని సంపద
మేష రాశి
నవంబర్ 15 నుంచి ఈ రాశి వారికి మహర్దశ పట్టనుంది. ఎప్పట్నించో పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. నలుగురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతితో పాటు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు అమితమైన లాభాలు ఆర్జిస్తారు. కొత్త వ్యాపారానికి అనువైన సమయం. విద్యార్ధులకు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఇంట్లో అందరి ఆరోగ్యం బాగుంటుంది
కుంభ రాశి
ఈ రాశి జాతకులకు అద్భుతమైన సమయం. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. కొత్త వ్యాపారాలకు సరైన సమయం. పనిచేసే చోట గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా పదోన్నతి కలుగుతుంది. జీతభత్యాలు పెరుగుతాయి. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు.
మకర రాశి
ఈ రాశివారికి నవంబర్ 15 నుంచి పట్టిందల్లా బంగారం కావచ్చు. అన్ని విధాలుగా అనుకూలమైన సమయం. ఆకశ్మిక ధనలాభం కలగడంతో ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు మంచి సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్ధులు రాణిస్తారు. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు
కన్యా రాశి
ఈ రాశి జాతకులకు గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా నవంబర్ 15 నుంచి దశ మారనుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు పరిష్కారమౌతాయి. దూర ప్రయాణాలు చేస్తారు కానీ లాభం కలుగుతుంది. వ్యాపారులకు అత్యంత అనువైన సమయం. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఎలాంటి డబ్బు సమస్యలు ఉండవు.
కర్కాటక రాశి
ఈ రాశివారికి దీపావళి తరువాత నవంబర్ మూడో వారం నుంచి అంతా బాగుంటుంది. ఏ రంగంలో అడుగెట్టినా విజయం లభిస్తుంది. ఊహించని సంపద వచ్చిపడుతుంది. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలుంటాయి. కొత్త ఆదాయ మార్గాలు తెర్చుకుంటాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు.