Diwali 2024: దీపావళి రోజు శని దేవుడిని పూజిస్తే.. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న బాధలన్నీ మాయం..
శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా శనిదేవుడు కర్మ ప్రధాత మనం చేసిన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు.
శని బాధ అనేది ప్రతి ఒక్కరికీ ఒక్కో దశలో ఉంటుంది. ఈ శని బాధలు తగ్గించుకోవడానికి శనిదేవుని పూజిస్తారు. అయితే, శని దేవుడికి అమావాస్య ఎంతో ప్రీతికరం. ఈరోజు ఆయన్ని విశేషంగా పూజించి అనుగ్రహం పొందవచ్చు.
దీపావళి అక్టోబర్ 31వ తేదీ లక్ష్మీదేవితోపాటు శనిదేవుడిని పూజిస్తే ఎంతో మంచిది. ఈరోజు ఆలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నూనెలో ముఖం చూసి దూరం ప్రాంతాల్లో వాటిని పారేయాలి.
ఈరోజు దానం చేయడం వల్ల కూడా విశేష ఫలితాలు కలుగుతాయి. శని పీడ నుంచి బయట పడాలంటే వేంకటేశ్వరుని, ఆంజనేయస్వాములకు కూడా పూజలు చేయాలి. నల్ల కుక్కులకు ఆహారం ఇవ్వాలి.
కాకులకు కూడా భోజనం పెడతారు. అంతేకాదు బ్రాహ్మణులకు మీ శక్తి మేరకు దానం ఇవ్వాలి. గొడుగు దానంగా ఇవ్వచ్చు. దీపావళి శనిదేవుని పూజించడం వల్ల శని పీడ నుంచి బయటపడతారు. అశేష ధన ప్రయోజనం కూడా పొందుతారు.