Upcomig IPO Details: వచ్చేవారం ఎంట్రీ ఇస్తున్న 4 ఐపీవోలు, మీ అదృష్టం పరీక్షించుకోండి

Sat, 17 Feb 2024-10:33 pm,
Share market updates know these 4 ipo coming in next week

ఇక వచ్చేవారం ఎట్‌మాస్ట్‌కో లిమిటెడ్ , ఎస్కోనెట్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఇంటీరియర్స్ అండ్ మోర్ లిమిటెడ్, కళారిధన్ ట్రెండ్స్ లిమిటెడ్, థాల్ కాస్టింగ్ లిమిటెడ్ ఐపీవోలు కూడా లిస్టింగ్ కానున్నాయి. 

Share market updates know these 4 ipo coming in next week

ఎస్ఎంఈ విభాగంలో జెనిత్ డ్రగ్స్ 40.6 కోట్ల రూపాయల ఐపీవోను ఫిబ్రవరి 19న ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 22 వరకే బిడ్ సమర్పించవచ్చు. ఈ ఇష్యూ లిమిట్ 79 రూపాయలే. 1600 షేర్లు ఒకేసారి తీసుకోవచ్చు. ఇదికాకుండా డీమ్ రోల్ టెక్ ఫిబ్రవరి 20వ తేదీన పబ్లిక్ ఇష్యూ తీసుకొస్తోంది. ఈ ఇష్యూ ప్రైస్ 129 రూపాయలుగా ఉంది. 

Share market updates know these 4 ipo coming in next week

కోల్‌కతాకు చెందిన జీపీటీ హెల్త్‌కేర్ ఐఎల్ఎస్ హాస్పిటల్ బ్రాండ్‌తో మిడ్ సైజ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్ని నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 22న ఐపీవో ఓపెన్ అవుతుంది. ఫిబ్రవరి 26న క్లోజ్ కానుంది. 10 రూపాయల ఫేస్ విలువతో ఈ ఐపీవో ద్వారా 40 కోట్లు సమీకరించనుంది. 

హయాత్ బ్రాండ్‌లో హోటల్స్ నిర్వహిస్తున్న జూనియర్ హోటల్స్ ఐపీవో ఫిబ్రవరి 21న ఓపెన్ కానుంది. ఫిబ్రవరి 23న క్లోజ్ అవుతుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ 1800 కోట్లు సేకరించాలనుకుంటోంది. 10 రూపాయలు ఫేస్ విలువతో ఐపీవో 342-360 రూపాయలు మధ్యలో ఉండవచ్చు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link