Stock Tips: ఈ 5 స్టాక్స్ లో ఏడాది పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేసి మరిచిపోండి..మంచి రాబడి మీ సొంతం అయ్యే చాన్స్..!!
5 Top Stocks to Buy Sharekhan: స్టాక్ మార్కెట్లో మీరు లాంగ్ టర్మ్ స్టాక్స్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే షేర్ ఖాన్ బ్రోకరేజ్ సంస్థ ఫండమెంటల్ ఆధారంగా బలంగా ఉన్నటువంటి ఐదు స్టాక్స్ ను రికమెండ్ చేసింది. వీటిలో మీరు సంవత్సరం కన్నా ఎక్కువ కాలం పాటు ఇన్వెస్ట్ చేసినట్లయితే, మంచి రాబడి పొందే అవకాశం ఉందని పేర్కొంది. అలాంటి టాప్ ఫైవ్ స్టాక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్టాక్స్ రాబోయే సంవత్సరకాలంలో దాదాపు 35శాతం వరకు పెరిగే అవకాశం ఉందని షేర్ ఖాన్ బ్రోకరేజీ సంస్థ తెలిపింది.
మిసెస్ బెక్టర్స్ ఫుడ్(Mrs. Bectors Food): షేర్ ఖాన్ బ్రోకరేజీ ఈ షేరుపై బయ్యింగ్ ఇంట్రెస్ట్ చూపించింది. అలాగే ఒక్కో షేరు టార్గెట్ ధర రూ.1705గా నిర్ణయించింది. ప్రస్తుతం బెక్టార్ ఫుడ్ షేర్ ధర రూ.1402 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్ ప్రస్తుత ధర నుండి దాదాపు 22 శాతం రాబోయే ఏడాది కాలంలో పెరిగే అవకాశం ఉంది.
టాటా మోటార్స్‌పై (Tata Motors): టాటా మోటార్స్‌పై షేర్‌ఖాన్ బయ్యింగ్ ఇంట్రెస్ట్ చూపించింది. అలాగే ఒక్కో షేరు టార్గెట్ ధర రూ.1235గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ షేర్ ధర రూ.1159 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్ ప్రస్తుత ధర నుంచి దాదాపు 6 శాతం రాబడి అందించే అవకాశం ఉంది.
V2 రిటైల్ (V2 Retail): షేర్‌ఖాన్ V2 రిటైల్‌పై బయ్యింగ్ ఇంట్రెస్ట్ చూపించింది. అలాగే ఒక్కో షేరు టార్గెట్ ధర రూ.1250గా నిర్ణయించింది. ప్రస్తుతం ఈ షేరు ధర రూ.932 వద్ద ట్రేడవుతోంది. అలాగే ఈ స్టాక్ ప్రస్తుత ధర నుండి దాదాపు 34 శాతం బలమైన అప సైడ్ మూమెంట్ పొందే వీలుంది.
టీసీఐ (TCI): TCIపై షేర్‌ఖాన్ బయ్యింగ్ ఇంట్రెస్ట్ చూపించింది. అలాగే ఒక్కో షేరు టార్గెట్ ధర రూ.1200గా నిర్ణయించింది. ప్రస్తుతం ఈ షేర్ ధర రూ.1011 వద్ద ట్రేడవుతోంది. స్టాక్ ప్రస్తుత ధర నుండి దాదాపు 19 శాతం బలమైన అప్ సైడ్ మూమెంట్ పొందే వీలుంది. (Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.)