Khaleda zia: ఖలిదా జియా ఎవరు.. 17 ఏళ్ల జైలు శిక్ష నుంచి విడుదలైన హసీనా బద్ధ శత్రువు గురించి ఈ విషయాలు తెలుసా..?

Tue, 06 Aug 2024-10:04 pm,

ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్ రాజకీయం అనిశ్చితి ఏర్పడింది. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ల అంశం ఏకంగా బంగ్లా పీఠాన్ని కుదిపేసింది. ఈ నేపథ్యంలో..మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు ఆ దేశాధ్యక్షుడు కీలక  ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే మాజీ ప్రధాని ఖలిదాజియా నుంచి జైలు నుంచి విడుదల చేశారు.   

విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో 17ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న జియా విడుదలకు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ఆదేశాలు ఇవ్వడంతో ఆమె గృహనిర్భందం నుంచి విడుదలయ్యారు. గత కొన్నేళ్లుగా ఆమె ఈ కేసులో భాగంగా.. జైలు శిక్షను  అనుభవిస్తున్నారు.

ఖలీదా జియా అవిభాజ్య భారత్‌లోని పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం జల్‌పాయిగుడీలో 1945 ఆగష్టు 15న జన్మించారు. ఖలీదా భర్త లెఫ్టినెంట్ జనరల్ జియావుర్ రెహమాన్. 1977 నుంచి 1981 వరకు బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. 

 

1981లో జియావుర్ రెహమాన్ హత్యకు గురికావడంతో ఖలీదా జియా బేగం రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని చెప్పుకొవచ్చు. అప్పటినుంచి ఆమె బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పి) అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.

ఇదిలా ఉండగా..ఖలిదా 1991 లో బంగ్లాదేశ్ కు తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీనికోసం ఇతర పార్టీల మద్దతు తీసుకున్నారు. మరల 1996 లో రెండోసారి ఖలీదా ఎన్నికలలో విజయంసాధించారు. ఈ ఎన్నికలలోఅక్రమాలు జరిగాయని అవామీలీగ్, మరికొన్నిపార్టీలు ఎన్నికలను బహిష్కరించాయి.  

ఆతర్వాత జరిగిన ఎన్నికలలో అనూహ్యంగా.. షేక్ హసీనా విజయంసాధించింది. రెండో మహిళ ప్రధానిగా ఎన్నికైంది. ఆ తర్వాత మరల ఐదేళ్ల తర్వాత జియా మరల పీఎం అయ్యింది. 2001 నుంచి 2006 వరకు పీఎంగా ఉన్నారు.  

2018 లో విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో.. ఖలీదా జియా.. పదిహేడేళ్ల జైలు పనిష్మెంట్ కు గురయ్యారు.  ఆతర్వాత నుంచి ఆమె జైలులోని మగ్గిపోయారు. ప్రస్తుతం 78 ఏళ్ల ఖలీదా జియా అనేక అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆమె మరోసారి పీఎంగా బాధ్యతలు స్వీకరించవచ్చని వార్తలు  వైరల్ గా మారాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link