Shilpa Shetty: 50 ఏళ్ల వయసులో 20ల కనిపించే శిల్పాశెట్టి బ్యూటీ సీక్రెట్స్ తెలుసా..!

మధ్యలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా.. ఎప్పటికపుడు తన యోగాసనాలతో అభిమానులకు దగ్గరగానే ఉంది. ఏజ్ 50కు దగ్గర పడుతున్నా.. శిల్పాను చూస్తే అలా అనిపించదు. ఏ పాతికో.. ముప్పై ఏళ్లు ఉంటాయని చాలా మంది అనుకుంటారు. అంతలా తన సోయగంతో ఇప్పటికీ కుర్రకారును నిద్రలేకుండా చేస్తోంది.

శిల్పా శెట్టి శరీరాకృతిని కాపాడుకోవడంలో పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు యోగాసనాలు చేయడం శిల్పా స్పెషాలిటీ. యోగాసనాలతో శరీరాన్ని నిత్య నూతనంగా ఉండేలా చేస్తుందని శిల్పా భావిస్తోంది. అంతేకాదు రోజు క్రమం తప్పకుండా వేడి నీళ్లు తాగుందట.
శిల్పా శెట్టి ఫిట్నెస్ కు ముఖ్య కారణం ఆమె వ్యాయామం. జిమ్ లో వర్క్ అవుట్ చేయడమే కాక శిల్పా యోగా కూడా బాగా చేస్తుంది. యోగ మన శరీరాన్ని ఫిట్ గా ఉంచడంతోపాటు యవ్వనంగా ఉండేలా చేస్తుంది అని శిల్పా భావిస్తుంది. ఆమె అందాల రహస్యానికి మరొక కారణం వేడి నీళ్లు. రోజు పొద్దున నిద్రలేచిన తర్వాత కాళీ కడుపుతో ఆమె కోరు వెచ్చటి నీటిని కచ్చితంగా తాగుతుందట.
టిఫిన్‌లో ఉదయం పూట బొప్పాయి పండు.. కొన్ని ఫ్రూట్ సలాడ్స్ తీసుకుంటుందట. ఆయిల్ పదార్ధాలకు శిల్పా ఆమడ దూరం. మరోవైపు నాన్ వెజ్ వంటకాల్లో చేపలు మాత్రమే తీసుకుంటుందట. రాత్రి పూట కేవలం మజ్జిగ మాత్రమే తీసుకుటుందట.
ఇవి కాకుండా వీలు చిక్కినపుడల్లా టైమ్‌కు నిద్రపోవడం.. ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉండటం వలనే తాను ఇంత నాజూగ్గా ఉన్న విషయాన్ని శిల్పా పలు ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ ఉంటటం విశేషం.