Guru Purnima 2024: తిరుమలను మించిన షిర్డీసాయి ఆదాయం.. గురు పౌర్ణమి ఒక్కరోజే ఏకంగా..

Thu, 25 Jul 2024-5:46 pm,

తిరుమల శ్రీవారిని భక్తులు కొంగుబంగారంగా భావిస్తారు. ప్రతిరోజు లక్షలాదిగా స్వామివారిని దర్శించుకుంటారు. ఒక్కసారైన స్వామి వారిని కళ్లరా చూసుకునే భాగ్యం కోసం పరితపిస్తుంటారు. తిరుమలలో నిత్యం.. భక్తులు స్వామికి బంగారం,వెండి, ప్లాటీనమ్, డబ్బులను తమ కానుకలుగా సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు.   

కొందరు నిలువు బంగారాన్ని కూడా తిరుమల స్వామివారికి సమర్పించుకుంటారు. ఇక స్వామి వారికి విదేశాల నుంచి భక్తులు భారీగా కానులకలను ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల స్వామి వారి ఆలయం ప్రపంచలోనే అత్యంత ధనిక ఆలయాలలో ఒకటిగా పేరుగాంచింది. ఇదిలా ఉండగా.. ఇటీవల శిర్డీ సాయిబాబా.. ఆలయం గురు పౌర్ణమి రోజున భారీగా కానుకలు వచ్చినట్లు తెలుస్తోంది.

ఏకంగా తిరుమల శ్రీవారి కన్నా.. కూడా భక్తులు గురుపౌర్ణమి మూడు రోజుల్లో భారీగా కానుకలు వచ్చినట్లు సమాచారం. గురుపౌర్ణిమ సందర్భంగా జులై 20న ప్రారంభమైన ఉత్సవాలు మూడు రోజులపాటు జరిగాయి. ఒక్క రోజే షిర్డీ సాయికి రూ.6 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశుడి ఆదాయంతో శిర్డీ సాయికి పోటీ ఏర్పడింది. గురుపూర్ణిమ సందర్భంగా జులై 20న ప్రారంభమైన ఉత్సవాలు మూడు రోజులపాటు జరిగాయి. దీనిలో భాగంగా ఆదివారం రోజున జులై 21న గురుపౌర్ణమిని నిర్వహించారు.   

ఒకవైపు ఆదివారం కావడటం  గురుపౌర్ణమి నేపథ్యంలో భారీగా భక్తులు షిరీడి సాయిబాబా ఆలయంను దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఒక్కరోజే..  షిర్డీ సాయికి రూ.6 కోట్లకుపైగా ఆదాయం సమకూరినట్లు సమాచారం. భక్తుల నుంచి విరాళాలు వివిధ రూపాల్లో ఈ ఆదాయం వచ్చినట్లు సాయి సంస్థాన్  ఆలయ అధికారులు వెల్లడించారు. 

ఈ సందర్భంగా శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ (SSST) సీఈఓ గోరక్షా గాడిల్కర్ మాట్లాడుతూ.. ఉత్సవాల సందర్భంగా ఆలయానికి 2 లక్షల మంది భక్తులు తరలివచ్చారని తెలిపారు. గురుపూర్ణిమ సందర్భంగా ఆలయానికి రూ. 2 కోట్ల 50 లక్షలకుపైగా నగదు వచ్చిందన్నారు. రూ. కోటికి పైగా విరాళం సమకూరగా, డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు, ఆన్‌లైన్ విరాళాలు, చెక్కులు, మనీ ఆర్డర్‌ల ద్వారా సుమారు రూ. 2 కోట్ల విరాళాలు అందాయి. 

కొంతమంది భక్తులు రూ. 10 లక్షలకు పైగా విలువైన బంగారం, వెండిని విరాళంగా ఇచ్చారు. లడ్డూ కవర్ల విక్రయం ద్వారా ఆలయ ట్రస్టు రూ.62 లక్షలకు పైగా వసూలు చేసింది. ప్రత్యేక క్యూలో వెళ్లి బాబాను త్వరగా దర్శించుకోవాలనుకునేవారికి రూ. 200 ప్రత్యేక టికెట్లు జారీ చేశామని గాడిల్కర్ తెలిపారు. మూడు రోజుల పండుగ సందర్భంగా  షిర్డీ పట్టణం భక్తులతో కిటకిటలాడింది. ఉత్సవాల ప్రధాన రోజైన జులై 21న జపాన్‌కు చెందిన 18 మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి బాబా ఆశీస్సులు తీసుకున్నారు. గత 10 సంవత్సరాలుగా ఏటా షిర్డీని దర్శించుకుంటున్నట్లు సమాచారం.

ఉత్సవాల సందర్భంగా సాయి ప్రసాదాలయంలో లక్ష 90 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులను కల్పించామని ఆయన అన్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కేంద్రంలో 5 వేల మందికి పైగా భక్తులకు చికిత్సలు అందించగా, మరికొందరు రక్తదానం కూడా చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link