Tollywood: తండ్రేమో 5 పెళ్ళిళ్ళు.. కూతురేమో 3 పెళ్ళిళ్ళు.. ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే..!
ఈమె ఒక తెలుగు స్టార్ హీరోయిన్.. ముఖ్యంగా సుధాకర్ తో కోలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు ఎన్నో చిత్రాలలో నటించి మంచి ఇమేజ్ సొంతం చేసుకొని, అక్కడ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న తర్వాత టాలీవుడ్ కి వచ్చిన ఈమె ఎక్కువగా చిరంజీవితో చాలా సినిమాలలో నటించింది. ముఖ్యంగా చిరంజీవి ఫేవరెట్ హీరోయిన్ కూడా కావడం గమనార్హం.
చిరంజీవి , బాలకృష్ణ , మోహన్ బాబు ఇలా ఎంతోమంది హీరోల సరసన నటించిన ఈమె, తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఈమె మూడు పెళ్లిళ్లు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈమె తండ్రి ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. ఆయన ఒక నటుడు కూడా. మరి ఆమె ఎవరో కాదు రాధికా శరత్ కుమార్.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రాధికా శరత్ కుమార్.. ఎవరో కాదు కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎం ఆర్ రాధ కుమార్తె. ఈయనకు ఐదు పెళ్లిళ్లు జరిగాయి. అందులో ప్రేమావతి మొదటి భార్య కాగా , ధనలక్ష్మి, సరస్వతి, జయమ్మాళ్ల, గీత.. ఇలా 5 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. చిట్టచివరి భార్య అయిన గీత శ్రీలంకకు చెందిన మహిళ. ఈమెకు , ఎం ఆర్ రాధాకు జన్మించిన కూతురే రాధిక శరత్ కుమార్.
రాధిక తండ్రికి ఐదు పెళ్లిళ్లు జరగగా.. ఐదు మంది భార్యల ద్వారా ఏకంగా 12 మంది పిల్లలను ఆయన సంతానంగా పొందారు. రాధికకు ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె ఎవరో కాదు నిరోష. మనందరికి తెలిసిన హీరోయిన్. రాధికా విషయానికి వస్తే ఈమె కూడా మూడు పెళ్లిళ్లు చేసుకుంది.
రాధిక మొదట ప్రతాప్ పోతెన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోగా రీఛర్డ్ హార్డి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది . అతడితో కూడా ఎక్కువ కాలం ఉండలేక శరత్ కుమార్ ను మూడో పెళ్లి చేసుకుంది. అయితే శరత్ కుమార్ కి కూడా ఆల్రెడీ వివాహం జరిగింది. అప్పటికే వివాహమైన ఈయన మళ్లీ రాధికను వివాహం చేసుకున్నారు.