Deepika During Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో కూడా బరువు పెరగని దీపికా.. నిపుణులు చెప్పిన కారణాలు తెలిస్తే షాక్ అవుతారు..!
వైద్యుల ప్రకారం దీపికా ప్రెగ్నెన్సీ సమయంలో ఎందుకు బరువు పెరగలేదు తెలుసా? దీపికా పదుకునే డెలివరీ ముందు కూడా సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించారు. ఆ తర్వాత దీపికా ఓ పాపకు జన్మనిచ్చింది. అయితే, ఆ సమయంలో కూడా దీపికా ఎలాంటి వెయిట్ పెరగలేదు. అంటే గర్భందాల్చిన 9 నెలలు దీపికా అస్సలు బరువు పెరగలేదు.
దీనిపై సోషల్ మీడియాలో ఎంతోమంది దీపికాది ఫేక్ ప్రెగ్నెన్సీ అంటే కూడా ఆమె ఎప్పుడూ స్పందించలేదు. కానీ, బయట ఎక్కడ ఆమె కెమెరాకు చిక్కినా ఆమె ముఖంపై చిరునవ్వు మాత్రమే కనిపించేది. అయితే, ఇలా బరువు పెరగకుండా ఎలా సాధ్యమని చాలామందిలో మెదిలే ప్రశ్న..
ఎందుకంటే ఏ స్త్రీ అయినా గర్భందాల్చినప్పుడు కచ్చితంగా బరువు పెరుగుతుంది. కొందరికి ముఖంపై కూడా వాపు కనిపిస్తుంది. అయితే, ఇది ఒక్కక్కరకీ ఒక్కో విధంగా ఉంటుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గర్భం దాల్చినప్పుడు ప్రతి స్త్రీ కచ్చితంగా తన అసలైన బరువు కంటే 9-12 కేజీలు పెరుగుతుంది. అయితే, దీపికా తన ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఆమె యోగా చేస్తూ డైట్ పాటించారు. ఈ రెండూ చాలు ఒక వ్యక్తి బరువు పెరగకుండా ఉండటానికి అని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు.
కొంతమంది ప్రెగ్నెన్సీ సమయంలో బరువు బాగా పెరుగుతారు. ఆ తర్వాత లైఫ్‌స్టైల్‌లో మార్పులు చేసుకుంటూ డైట్ పాటిస్తే కచ్చితంగా మళ్లి బరువు తగ్గిపోతా. ఇలా దీపికా పదుకొనేలా స్లిమ్ బాడీ కలిగి ఉండటం కూడా సాధారణమే అంటున్నారు ఫిట్నెస్ నిపుణులు.
అంతేకాదు గర్భధారణ సమయంలో ప్రతి స్త్రీ కేజీ నుంచి 1.5 పెరుగుతుంది. ఈ బరువును బెరీజు వేసుకుంటూ డైట్ నిర్వహించినా బరువు అతిగా పెరగకుండా ఉంటారు. చివరి నెలలో శిశువు బరువు కేవలం 2.5 కేజీలు మాత్రమే ఉంటుంది. మిగతా వెయిట్ అంతా నీళ్లు, మాయ ఉంటుంది.
సహజంగా సినీ నటులు తమ బరువును ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉంటార. దీపికా శరీరంపై అస్సలు కొవ్వు కూడా పేరుకోలేదు. ఎప్పటికప్పుడు ఆమె వైద్యుల సలహా మేరకు తన కార్యకలాపాలను కూడా కొనసాగించింది. సమయానికి తినడం, వ్యాయామంచ స్విమ్మింగ్, నడక, యోగా ఇవన్ని బరువు పెరగకుండా కాపాడతాయి.