Shravana Masam 2024: శ్రావణమాసంలో లక్ష్మీదేవికి నెయ్యి దీపం ఇలా పెడితే.. అదృష్టం మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది..!!
Shravana Masam 2024: శ్రావణమాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం.ఈ మాసంలో అమ్మవారికి ఎన్నో రకాల పూజలు చేస్తుంటారు. శ్రావణమాసం ఆగస్టు 5వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 3వ తేదీన ముగుస్తుంది. ఈ మాసంలో చాలా మంది ఉపవాసం ఉంటారు. అమ్మవారికి మంగళహారతులు, మంత్రాలు పఠిస్తుంటారు. అయితే లక్ష్మీపూజలోనే కాదు అన్ని పూజల్లో దీపం వెలిగించే సంప్రదాయం ఉంది.
ముఖ్యంగా హిందూమతంలో దీపం లేకుండా దేవుళ్లను పూజించరు. అదేవిధంగా దీపంలో అమ్మవారిని పూజిస్తారు. లక్ష్మీదేవి ఆశీస్సులు పొంది..ఆర్థికంగా ఉన్నతస్థానంలో ఉండాలంటే మనం వెలిగించే దీపం విధానం చాలా ముఖ్యం. ముఖ్యంగా దీపం ను రకరకాల నూనెలతో వెలిగిస్తుంటారు. కానీ లక్ష్మీదేవికి మాత్రం నెయ్యి అంటే చాలా ప్రీతికరం. ఈ నెయ్యితో అమ్మవారి ముందు దీపం వెలిగిస్తే..అమ్మవారే మీ ఇంట్లో కొలువై ఉంటారని చాలా మంది నమ్ముతుంటారు. అయితే శ్రావణమాసంలో నెయ్యి దీపం వెలిగించేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉంటాయి.
ముఖ్యంగా పూజలో క్యాండిల్స్ అస్సలు వాడకూడదు. రెడీమేడ్ నెయ్యి కొవ్వొత్తులు చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. కానీ అలాంటి వాటిని లక్ష్మీదేవి ముందు వెలిగించకూడదు. స్వచ్చమైన నెయ్యిని దీపం వెలిగించేందుకు ఉపయోగించాలి. శ్రావణమాసంలో ఇంట్లోనే వత్తులను తయారరు చేసుకోవాలి.ఇంట్లో తయారు చేసిన వత్తి కర్పూర పరిమళం వెదజల్లుతుంది. ఇలాంటి వాతావరణం ఇంటిని సానుకూలంగా ఉంచుతుంది.
నెయ్యిదీపానికి కావాల్సిన పదార్థాలు :ఇంట్లో దీపం తయారు చేసేందుకు స్వచ్చమైన ఆవు నెయ్యి, కర్పూరం బిల్లలు, పత్తి తీసుకోవాలి. మీ అవసరాన్ని మీకు కావాల్సిన వత్తులు తయారు చేసుకోండి. వత్తికి ఉపయోగించే నెయ్యి కల్తీ ఉండకూడదు.
దీపం ఎలా తయారు చేయాలి? వత్తి చేయడానికి పాన్లో నెయ్యి వేసి చిన్న మంట మీద వేడి చేయండి. తర్వాత చల్లార్చి..కర్పూరం బిల్లలను పొడిగా చేసి ఆ నెయ్యిలో వేసి కలపండి. ఇప్పుడు ఒక ఐస్ ట్రే తీసుకుని అందులో పత్తితో తయారు చేసిన వత్తి వేయండి. ఈ మిశ్రమాన్ని అందులో వేయండి. సుమారు అరగంటపాటు ఫ్రిజులో ఉంచండి. అంతే ఈ నెయ్యి దీపాన్ని లక్ష్మీదేవి ముందు వెలిగించండి.
శ్రావణ మాసంలో ఉదయం, సాయంత్రం లక్ష్మీదేవి ముందు ఈ వత్తులతో తయారు చేసిన దీపాలను వెలిగించండి. ఆ దీపం వెలుగుతున్నంత సేపు ఇంట్లో నెయ్యి, కర్పూర పరిమిళం వెదజల్లుతుంది. ఇంట్లో ప్రతికూల శక్తిని పారద్రోలి..సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.