Shriya Saran : దీపావళి వెలుగులను ముందుగా తెచ్చిన శ్రియ.. ఫ్యామిలీ పిక్స్ వైరల్..
Shriya Saran In Saree: హీరోయిన్ శ్రియ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు కావస్తున్న.. ఇంకా 25 ఏళ్ల అమ్మాయి లాగే కనిపిస్తుంది
కాగా హీరోయిన్ శ్రియకి పెళ్లి అయ్యి దాదాపు నాలుగు సంవత్సరాల కూతురు కూడా ఉంది అన్న సంగతి తెలిసిందే. తన కూతురు రాధా ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో తరచూ షేర్ చేస్తూ ఉంటుంది శ్రియ.
ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు తన ప్రతి మూమెంట్ ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇంట్లో చేసుకున్న దీపావళి సంబరాల ఫొటోస్ షేర్ చేసింది.
ఈ ఫొటోల్లో ఆమె భర్త ఆండ్రీ కొస్చీవ్, కూతురు రాధా కూడా ఉండడం విశేషం. ఈ ఫొటోస్ లో శ్రియా చక్కగా చీరలో చందమామ లాగా కనిపించింది.
శ్రియ తన భర్త, కూతురు, ఇంకా తన ఫ్యామిలీ వారితో కలిసి తీసుకున్న ఫోటోలు కొన్ని నిమిషాల్లోనే వైరల్ గా మారాయి.