Shriya Saran: సీతాకోకచిలుకలా శ్రియ.. కెవ్వు కేక అంటున్న అభిమానులు

42 సంవత్సరాల వయసులో కూడా ఇంకా 22 సంవత్సరాల హీరోయిన్ లానే కనిపిస్తూ ఉంటుంది శ్రియ. ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్ సంతోషం చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది.

సంతోషం సినిమా విడుదలై సక్సెస్ సాధించిన దగ్గర నుంచి శ్రియకి ఆఫర్ల కొరత లేకుండా పోయింది. దాదాపు 15 సంవత్సరాలకు పైగా శ్రియ తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.
ఆ తర్వాత రజనీకాంత్ శివాజీ సినిమా సక్సెస్ తో తెలుగులో కన్నా తమిళంలో ఎక్కువ ఆఫర్లు తెచ్చుకోవడం మొదలెట్టింది. ఇక ఆ తరువాత ఆవారాపన్ చిత్రంతో బాలీవుడ్ లో సైతం తన హవా చూపించింది.
హాలీవుడ్ లో సైతం ది అదర్ ఎండ్ ఆఫ్ లైన్ చిత్రంతో తెరగేత్రం చేసింది. ఇలా భాషతో.. ప్రాంతంతో సంబంధం లేకుండా.. తన పాపులారిటీ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.
గత కొద్ది రోజులగా సినిమాలకు కొంచెం దూరంగా ఉన్న శ్రియ ఇంస్టాగ్రామ్ లో మాత్రం ఎప్పుడు స్టైలిష్ ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. తాజాగా బ్లూ డ్రెస్ లో శ్రియ షేర్ చేసిన ఫోటోలు అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి.