Shriya Saran: ఎర్ర రోజా పువ్వుని తలపిస్తున్న శ్రియ అందాలు.. ఫిదా అవుతున్న అభిమానులు..
Shriya Saran Viral Pics: ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై సంతోషం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని చోటు సంపాదించుకుంది.
ఆ తరువాత దాదాపు అందరూ స్టార్ హీరోలతో అలానే చిన్న హీరోలతో సైతం ఎన్నో సినిమాలు చేసి సూపర్ హిట్ లు అందుకుంది.
10 సంవత్సరాలకు పైగా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న శ్రియ ఆ తరువాత శివాజీ సినిమాతో తమిళ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.
తమిళంలోనే కాదు హిందీలో కూడా మంచి పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ నటించని భాష లేదు అంటే అతిశయోక్తి కాదు.
హాలీవుడ్ లో సైతం ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్ అనే సినిమాలో కనిపించి శ్రియకి ఏ భాష ప్రేక్షకులు అయినా ఫిదా అవ్వాల్సిందే అని రుజువు చేసింది.
ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ప్రస్తుతం రెడ్ శారీలో షేర్ చేసిన ఫోటోలు అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈసారి లో ఈ హీరోయిన్ నిజంగానే రెడ్ రోస్ లా అందరిని అలరిస్తూ .. అభిమానుల దగ్గర నా చెలి రోజావే అనే పాట పాడిచ్చుకుంటోంది.