Shruti Haasan: ఫేమస్ మ్యాగజైన్ కవర్ పేజీపై ‘మెన్స్ ఎక్స్‌పీ’పై శ్రుతి హాసన్ హాట్ షూట్.. చూస్తే చూపు తిప్పుకోలేరేమో..

Wed, 30 Oct 2024-4:55 am,

శృతి హాసన్  మల్టీ టాలెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకోవడంలో ఆమె ముందు వరసలో ఉంటారు. రీసెంట్ గా ఆమె MensXP మ్యాగజైన్ అక్టోబర్ 2024 సంచిక కోసం ఏఐ టెక్నాలజీని వాడి ఫోటో షూట్ చేశారు.

ఈ ఏఐ టెక్నాలజీ వాడి చేసిన ఫోటో షూట్ చూస్తుంటే..  వీక్షకులను ఫ్యూచర్ వరల్డ్ లోకి  తీసుకువెళుతున్నట్టుగా ఉంది. ఇక్కడ శృతి హాసన్ టైమ్-ట్రావెలింగ్ హీరోయిన్ గా  కనిపిస్తున్నారు.

ఈ డిజిటల్ విధానంలో శృతి హాసన్ చేస్తుంటే చూపు తిప్పుకోలేరేమో. .మ్యాగజైన్ అక్టోబర్ 2024 సంచిక శ్రుతి హాసన్ టైమ్-ట్రావెలింగ్ అడ్వెంచర్ తో వీక్షకులను ఆకర్షించేలా ఉంది. శృతి హాసన్ లాస్ట్ ఇయర్ ప్రభాస్ ‘సలార్’ మూవీలో కథానాయకగా నటించింది. శృతి.. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్‌తో కలిసి "కూలీ" చిత్రంలో నటిస్తున్నారు. విభిన్న మాధ్యమాలు, భిన్న కళల ద్వారా శ్రుతి హాసన్ తన టాలెంట్‌ను ప్రదర్శించడంలో ముందుంటుంది.

గత కొన్నేళ్లుగా ఈ భామ ప్రముఖ ఆర్టిస్ట్ శంతను హజారికాతో ఎఫైర్ నడిపింది. అంతేకాదు కొన్నేళ్లుగా ముంబైలోని ఓ ఇంట్లో వీళ్లిద్దరు సహ జీవనం చేసారు. వీళ్లిద్దరి మధ్య ఎక్కడ చెడిందో కానీ.. ప్రస్తుతం అతనికి బ్రేకప్ చెప్పి ఒంటిరి జీవితాన్ని లీడ్ చేస్తోంది శృతి. ఈ విషయం ఆమె అప్పట్లో తన ఇన్ స్టాలో అతనితో ఉన్న ఫోటోలను డిలీట్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

అంతకు ముందు లండన్ కు చెందిన మైఖేల్ తో కూడా చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. అంతేకాదు అతనితో దగ్గరగా ఉన్న ఫోటోలను అప్పట్లో  షేర్ కూడా చేసింది. అతనికి బ్రేకప్ చెప్పిన తర్వాత 2019లో శంతనుకు దగ్గరయింది. తాజాగా అతనికి కూడా బ్రేకప్ చెప్పడంతో ప్రస్తుతం సింగిల్ గానే లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఇద్దరితో చెడటంతో ఇకపై ప్రేమ జోలికి పోనంటోంది ఈ భామ.

శృతి హాసన్ తెరపైనే కాకుండా, సంగీతంలోను మంచి ప్రవేశం ఉందన్న సంగతి తెలిసిందే కదా. కమల్ హాసన్ ఈనాడు మూవీకి ఈమె సంగీతం  అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. సేవా కార్యక్రమాల్లోనూ శ్రుతి హాసన్ ముందుంటారు. వివిధ స్వచ్ఛంద సంస్థలకు అండగా నిలుస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link