Actress Hot Comments: నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.. రిలేషన్, రొమాన్స్ అంటే ఇష్టం..! ప్రభాస్ భామ బోల్డ్ కామెంట్స్..
శృతి హాసన్ టాప్ హీరోలు అందరితో నటించింది. తెలుగు, తమిళ, హిందీ వంటి భాషల్లో కూడా నటించారు. తాజాగా క్రిస్మస్ రోజు ఆమె క్రిస్మస్ ట్రీ వద్ద దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే, ఇటీవల పెళ్లిపై శృతిహాసన్ చేసిన హాట్ కామెంట్స్ విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఆమె తన ప్రియుడు శాంతనుతో డేటింగ్ చేస్తోంది. అయితే, అతన్ని పెళ్లి చేసుకుంటారా? అని అడిగినప్పుడు ఈ కామెంట్స్ చేశారు.
లేదు నేను పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో అడగడం ఆపేయండి, పెళ్లి అంటే నాకు ఇష్టంలేదు భయం.. కానీ, రిలేషన్‌లో ఉండేందుకు ఇష్టపడతా, రొమాన్స్ అంటే ఇష్టం అని చెప్పింది.
అయితే, ఒకరితో నేను ఎక్కువగా అటాచ్ గా ఉండాలంటే నాకు భయం అందుకే అని చెప్పుకొచ్చింది. రిలేషన్ షిప్, డేటింగ్ గురించి శృతి హాసన్ గతంలో పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈమె చేసిన హాట్ కామెంట్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి.
కమాల్ హాసన్ కూతురు అయిన శృతి హాసన్ గతంలో మీడియాకు వాళ్ల అమ్మ నాన్న విడిపోవడం తనపై తీవ్ర ప్రభావం చూపిందని అది నాకు ఓ గుణపాఠం అని కూడా చెప్పింది. ఇక కమాల్ హాసన్, సారికలు 2004లో విడాకులు తీసుకున్నారు.
ఇతరులపై ఆధారపడకుండా ఫైనాన్షియల్‌గా స్వతంత్రంగా ఉండటం అప్పటి నుంచే తనకు అర్థమైందని చెప్పుకొచ్చింది.ఇక శృతి హాసన్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా నటించారు. ఓ మై ఫ్రెండ్, గబ్బర్ సింగ్, బలుపు, ఎవడు, రేసు గుర్రం వంటి తెలుగు సినిమాల్లో ఈమె నటించారు. 'ప్రేమామ్' సినిమా అయితే ప్రతిఒక్కరినీ మెప్పించింది.
తాజాగా ప్రభాస్ 'సలార్' పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమాలో నటించారు. హాయ్ నాన్న సినిమాలో కూడా గెస్ట్ రోల్ చేశారు. ఇప్పుడు శృతి సలార్ పార్ట్ 2 లో కూడా నటిస్తున్నారు.