Shruti Hassan: నాన్నకు తెలియకుండా టెంపుల్స్‌కు వెళ్లేదాన్ని.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన శృతిహాసన్..!
శృతిహాసన్ తండ్రి కమలహాసన్ తల్లి సారిక అయితే వీళ్ళిద్దరూ కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత శృతిహాసన్ స్వతంత్రంగా బతకడానికి నేర్చుకున్నాను అని ఇటీవల తెలిపింది.
శృతిహాసన్ ఇటీవల పెళ్లిపై కూడా సంచలన కామెంట్స్ చేసింది. పెళ్లంటే భయం రిలేషన్‌షిప్ అయితే ఓకే అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే, ఈ స్టార్ నటుడి కూతురు తన తండ్రి కమల్ హాసన్ పై కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది. తన తల్లిదండ్రులు విడిపోవడం బాధాకరం, అప్పటి నుంచే తను స్వతంత్రంగా బతకడం గురించి నేర్చుకున్నా అన్నారు అయితే తన తండ్రి నాస్తికుడు కానీ తల్లి మాత్రం దైవభక్తి ఎక్కువగా ఉందని చెప్పింది.
అయితే తనకు దేవుడిపై నమ్మకం ఏర్పడింది. ఆ తర్వాత ఆలయాలకు వెళ్లడం ప్రారంభించాను అని చెప్పారు శృతి. కానీ తండ్రికి తెలియకుండా టెంపుల్స్‌కు వెళ్లేదాన్ని చెప్పుకొచ్చింది. టెంపుల్స్ కి వెళ్ళిన తర్వాత తనలో పాజిటివిటీ కూడా పెరిగిందని చెప్పింది.
ఇక శృతి హాసన్ తెలుగు, తమిళ సినిమాలో తనదంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శృతిహాసన్ ఇప్పుడు రజినీకాంత్ తో నటిస్తున్నారు. ఇక ధనుష్ తో పాటు మరో చిత్రానికి రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది. శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికా తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే.