Shukra Gochar: శుక్రుడి కీలక గ్రహ మార్పు.. ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త.. ఈ పరిహారాలతో డబ్బే డబ్బు..
Shukra Gochar:శుక్ర గ్రహం ఆగష్టు 24న కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్ర రీత్యా శుక్రుడు కన్యా రాశిలో సంచరించడాన్ని అశుభ యోగంగా పరిగణిస్తారు. శుక్రుడి కన్యా రాశి సంచారంతో చండాల యోగం ఏర్పడుతోంది. దీంతో ఆ వ్యక్తి తీవ్ర ఆర్ధిక నష్టాలతో పాటు ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశాలు మెండుగా ఉండనున్నాయి. ఈ రాశుల వారు ప్రతి శుక్రవారం శుక్రుడికి బొబ్బర్లు దానం చేయడంతో పాటు తెల్లటి వస్త్రాలను బీదవాళ్లకు దానం చేసినచో.. గ్రహ దోషం కొంత వరకు తగ్గించుకోవచ్చు.
మేష రాశి శుక్రుడు కన్యారాశి ప్రవేశం వల్ల రాబోయే నెల.. 45 రోజులు.. ఈ రాశుల వారు అప్రమత్తంగా మెలగాలి. డ్రైవింగ్ చేసేటపుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తిగత, వ్యక్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు ఏర్పడే అవకాశాలున్నాయి. పబ్లిక్ రిలేషన్ దెబ్బ తినే అవకాశాలున్నాయి.
కర్కాటకం.. శుక్రుడు.. బుధుడికి సంబంధించిన కన్యారాశిలో ప్రవేశించడం వలన కర్కాటక రాశి వారు అప్రమత్తంగా ఉండాలి. వృత్తి జీవితంలో స్ట్రగులు పడుతారు. కుటుంబ సభ్యులతో కలహాలు ఏర్పడుతాయి. ఆర్ధికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సోదరులతో విభేదాలు ఏర్పడే అవకాశాలున్నాయి.
మకరం.. శుక్రుడు .. కన్యారాశి ప్రవేశం వలన ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. ఈ కారణంగా ధన నష్టం ఉంటుంది. పితృ సంబంధాల్లో విభేదాలు రావచ్చు. గుప్త రోగాల పాలు కావచ్చు. వృత్తి జీవితంలో పలు ఇబ్బందులు ఎదుర్కుంటారు. శతృవుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
గమనిక: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీనితో Zee Media ధృవీకరించడం లేదు.