Siddharth-Aditi: ప్రతి రోజూ తన వల్ల ఏడుస్తూ లేస్తాను.. పెళ్లయిన నెలకే సంచలన వ్యాఖ్యలు..!

Sat, 19 Oct 2024-8:00 am,

ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ స్టార్ కపుల్స్ లో ప్రముఖ నటుడు సిద్ధార్థ్, అదితి రావు హైదరి ల జంట కూడా ఒకటి. ఈ మధ్యనే సెప్టెంబర్ 16న ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఈ జంట ఒకరి గురించి ఒకరు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

2021లో అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం సినిమాలో షూటింగ్ సమయంలో మొదటిసారిగా సిద్ధార్థ అదితిని కలుసుకున్నారు. వీరి మధ్య స్నేహం చాలా త్వరగా నే ప్రేమగా మారింది. సినిమా షూటింగ్ సమయంలోనే ఈ జంట డేటింగ్ కూడా మొదలుపెట్టారు. సినిమా పెద్దగా ఆడలేదు కానీ.. ఈ జంట మధ్య ప్రేమ మాత్రం సక్సెస్ అయింది.

చాలా కాలం పాటు సీక్రెట్ గా డేటింగ్ చేసిన ఈ జంట.. జరిగిన నిశ్చితార్థంతో.. తమ రిలేషన్ షిప్ గురించి అధికారికంగా బయటపెట్టారు. ఇక పెళ్లి తర్వాత మాక్సిజన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సిద్ధార్థ ఎలాంటి బట్టల్లో బాగుంటారు అని అడగగా.. అదితి "హిప్ స్టర్ లో బాగుంటాడు.. నాకు తననిక  వెస్టీలో చూడటం ఇంకా ఇష్టం" అని అన్నారు.

ఉదయం లేవగానే అదితి ఏం చేస్తుంది అని అడగగా.. సిద్ధార్థ వెంటనే "నాకు ఇష్టం లేకుండా.. నా పర్మిషన్ కూడా లేకుండా నన్ను లేపుతుంది. నేను చాలా భారంగా.. చేసేది ఏమీ లేక.. కన్నీళ్ళతో ఉదయం నిద్ర లేస్తాను. తను మాత్రం ఏదో చిన్న పిల్లాడికి చేతిలో నుంచి క్యాండీ తీసుకున్నట్లుగా సంతోషిస్తుంది" అని సరదాగా చెప్పుకొచ్చారు. 

అది మిమ్మల్ని ప్రేమిస్తుంది అని మీకు ఎలా తెలుసు అని అడగగా.. సిద్ధార్థ్ "తను తన ప్రేమను చూపిస్తుంది" అని జవాబు ఇచ్చారు. ఇద్దరిలో ఎవరు ఎక్కువగా సారీ చెబుతారు అని అడగగా అదితి నేనే నేనే అంటూ చెప్పగా.. సిద్ధార్థ్ నేను రోజులో 100 మాటలు మాట్లాడితే అందులో 90 మాటలు సారీ ఉంటుంది. మిగతా పది థాంక్యూ ఉంటుంది అని అన్నారు. ఇద్దరిలో సిద్ధార్థ చాలా రొమాంటిక్ అంటూ అదితి ఒప్పుకుంది. వీళ్ళిద్దరికీ సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link