Side effects of Vitamin D Tablets: కరోనాకు చెక్ పెట్టేందుకు విటమిన్ డి పిల్స్ వాడుతున్నారా ? ఐతే రిస్కే!
Common symptoms of Vitamin D deficiency: విటమిన్ డి లోపం లక్షణాలు..
Fatigue: అలసటగా ఉండటం, మత్తుగా అనిపించడం.
Body ache: ఒంటి నొప్పులు కలగడం.
weakness: ఒంట్లో బలహీనత రావడం.
Chest pain: ఛాతిలో నొప్పిగా అనిపించడం వంటివి విటమిన్ డి లోపాన్ని సూచించే లక్షణాలుగా వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఎప్పుడు పడితే అప్పుడు విటమిన్ డి పిల్స్ తీసుకోకూడదు.
శరీరంలో విటమిన్ డి లెవల్స్ ఎక్కువైనా అనారోగ్యానికి దారితీస్తుంది.
విటమిన్ డి ట్యాబ్లెట్స్ ( Vitamin D tablets ) తీసుకునే ముందు శరీరంలో విటమిన్ డి లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అనేది టెస్ట్ చేయించి తెలుసుకోవాలి. ( Image courtesy : Pixabay )
విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది.
విటమిన్ డి పిల్స్ ( Vitamin D pills ) ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
విటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఏ స్థాయిలో అవసరమో ఆ స్థాయిలో మాత్రమే విటమిన్ డి పిల్స్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆపేయాల్సి ఉంటుంది.
విటమిన్ డి లెవెల్స్ అధికంగా ఉన్న వారిలో కళ్లు తిరగడం, వాంతులు, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వెద్యులు చెబుతున్నారు.
కడుపు నొప్పి, మలబద్ధకం, విరేచనాలు కూడా విటమిన్ డి పిల్స్ అధిక మోతాదులో తీసుకున్న వారిలో కనిపించే లక్షణాలు.
శరీరం నలుపు ఉన్న వారిలో విటమిన్ డి తక్కువగా ఉత్పత్తి అవుతుందని.. అలాగని వారిలో రోగ నిరోధక శక్తి ( Immunity ) తక్కువగా ఉంటుందని అంచనా వేయలేమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.