Wedding Secrets: పెళ్లిలో మూడుముళ్లే ఎందుకు వేస్తారు.. అసలు కారణం ఇదే..!
పెళ్లి అంటే.. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం అన్యోన్యంగా.. కలిసి ఉండే బంధం. మంచైనా, చెదైనా.. ఒకరి తోడు ఒకరు వదలకుండా ఉండడం. ఎన్ని కష్టాలు వచ్చినా.. ఒకరి కోసం ఒకరు నిలవడం. ఇతర దేశాల గురించి పక్కన పెడితే.. మన ఇండియాలో పెళ్లిళ్లు ఎంతో విలువైనవి. ముఖ్యంగా మన హిందువులు.. పెళ్లి అంటే ఎంత పవిత్రమైన వేదికగా చూస్తారో మనకు తెలిసిన సంగతే. మరి ఇంత మహోన్నతమైన పెళ్లిలో.. అత్యంత ముఖ్యమైన గతం తాళి కట్టడం.
పెళ్లంటే కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు.. రెండు కుటుంబాలను జీవితాలను ఒకటి చేసే అపూర్వమైన గతం. ఈ వివాహం ఇప్పుడంటే పెళ్లిని ఐదు గంటల్లోనే.. పూర్తి చేస్తున్నారు కానీ.. పూర్వం రోజుల్లో పెళ్ళంటే ఐదు రోజుల పండగ.
ఐదు రోజులు వేడుకగా జరుపుకునే.. ఈ పెళ్లిలో మూడు ముళ్ళు.. ఎందుకు వేస్తారు దీని వెనక ఏదైనా పరమార్థం దాగి ఉందా అనే సందేహం.. మీకు ఎప్పుడైనా వచ్చిందా? దీని వెనుక ఉందే పరమార్థంకు..మన శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి అంటే
హిందూ సంప్రదాయంలో 3 అనే సంఖ్య..ప్రధాన పాత్ర పోషిస్తుంది. త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు.. ఇలా అన్నీ కూడా మూడు తో ముడి పడి ఉండటంతో పాటు.. మానవులకు సూక్ష్మ స్థూలకారణ అనే మూడు శరీరాలు ఉంటాయి.
పెళ్లి సమయంలో వేసే..ఒక్కో ముడి.. ఒక్కో శరీరానిది. వధూవరులు కేవలం బాహ్య శరీరంతోనే.. కాకుండా మూడు శరీరాలతో.. కలిసిమెలసి ఉండాలని.. ఉద్దేశంతోనే మూడు ముళ్ళు వేస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.