Allu Arjun: బన్నీ జాగ్రత్త పడాల్సిందే.. మరోసారి మెగా అభిమానుల వివాదంలో చిక్కుకున్న హీరో!
అల్లు అర్జున్ తాజాగా స్నేహితుడి కారణంగా మెగా కుటుంబానికి దూరం అయిన విషయం తెలిసిందే. స్నేహితుడికి అండగా నిలిస్తే పర్వాలేదు కానీ ప్రత్యర్థి పార్టీకి చెందిన మిత్రుడికి అండగా నిలవడం వల్లే బన్నీకి అసలు చిక్కు ఏర్పడింది. ఎలాంటి నేరం చేయకపోయినా, రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తితో స్నేహం చేయడం వల్లే మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ కి దూరమైందని చెప్పవచ్చు.
ఎన్నికలకి ముందు వైఎస్ఆర్సిపి స్నేహితుడిని కలవడం మెగా అభిమానుల నుండి సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు ఏర్పడ్డాయి. వైయస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి సోషల్ మీడియాలో పుష్ప -2 ని పంచుకున్నారు. ప్రేమలు మరియు శుభాకాంక్షలు నా స్నేహితుడికి.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఇకపోతే స్నేహితుడికి శుభాకాంక్షలు తెలపడంలో తప్పులేదు. కానీ కొనసాగుతున్న పరిస్థితులు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రకంపనను దృష్టిలో పెట్టుకొని శిల్పారెడ్డి కనీసం పుష్ప -2 విడుదల వరకు కొంత దూరం పాటించాలని బన్నీ అభిమానులు కోరుతున్నారు.
ముఖ్యంగా అల్లు అర్జున్ సినిమా విడుదల చేసేటప్పుడు కేవలం బన్నీ అభిమానులు మాత్రమే తన సినిమాకి అండగా నిలిస్తే సరిపోదు. యావత్ సినీ ప్రేక్షకులు సినిమా చూస్తేనే తను అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలుంటాయి. దాదాపు నాలుగు ఏళ్ల తర్వాత సోలో హీరోగా సినిమాను విడుదల చేస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు మెగా అభిమానులతో పెట్టుకుంటే మాత్రం సక్సెస్ అవడం అసాధ్యం అంటూ బన్నీ అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు.
అసలే పుష్ప - 2 విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో బన్నీ వైసీపీ మాజీ నేత పోస్ట్ కి రిప్లై ఇవ్వడంతో మరోసారి మెగా అభిమానులు భగ్గుమంటున్నారు. ఇకనైనా బన్నీ ఇలాంటివి తగ్గించుకొని, మెగా అభిమానులను దగ్గరకు చేర్చుకుంటే మంచిదని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.