Beetroot Puree: బీట్రూట్ పూరీ.. తిన్నారంటే పక్కా మళ్ళీ మళ్ళీ కావాలంటారు!
బీట్రూట్ పూరి తయారీకి కావలసిన పదార్థాలు: 2 కప్పుల గోధుమ పిండి, 1/2 కప్పు తురిమిన బీట్రూట్, 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,
1/2 టీస్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీస్పూన్ కారం పొడి, 1/4 టీస్పూన్ ఉప్పు, నూనె వేయడానికి
తయారీ విధానం: ఈ బీట్రూట్ పూరీలు తయారు చేసుకోవడానికి ముందుగా పిండి కలపడానికి సరిపోయే బౌల్ ని తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని, అందులో తురిమిన బీట్రూట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, కారం పొడి, ఉప్పు వేసి బాగా మిక్సీ కొట్టుకోవాల్సి ఉంటుంది .
ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని బౌల్లో వేసుకొని అందులో గోధుమపిండిని కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ, మెత్తని పిండిని కూర్చాలి.
పిండి చాలా గట్టిగా లేదా చాలా పలచగా ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇలా బాగా కలుపుకున్న పిండి మిశ్రమాన్ని 15 నిమిషాలు పాటు బౌల్ పై మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలా చేసుకుని మరో 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
ఈ తయారు చేసుకున్న ముద్దలను పూరి లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఒక బాణలిలో నూనె వేడి చేసి, పూరీలను బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి.
వేడి వేడిగా మీకు ఇష్టమైన కూర లేదా పప్పుతో కలిపి తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి మీ సొంతం.