Simple Business Ideas: ఉన్న ఊరి నుంచి కాలు కదపకుండా.. ఈ బిజినెస్ చేస్తే చాలు నెలకు రూ. 1 లక్ష పక్కా
చాలామంది గ్రామీణ ప్రాంతాలను వదిలిపెట్టి పట్టణాల్లో ఉద్యోగాలు చేయడానికి కూలి చేయడానికి ఇలా రకరకాల పనులు చేయడానికి వచ్చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అయితే మీరు ఉన్న గ్రామంలోనే ఉంటూ చక్కటి ఆదాయం లభించినట్లయితే, గ్రామాలను వదలాల్సిన అవసరమే లేదు.
ప్రస్తుతం ఓ చక్కటి బిజినెస్ ఐడియా ద్వారా మీరు ప్రతి నెల ఒక లక్ష రూపాయల వరకు సంపాదించే అవకాశం గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉంది. పైగా ఈ బిజినెస్ కు మీకు ఏడాది పొడుగునా డిమాండ్ ఉంటుంది.
నిజానికి ఒక ప్రణాళిక ప్రకారం వ్యవసాయం చేస్తే నిరంతరం ఆదాయం లభిస్తుంది ప్రస్తుతం కూరగాయల సాగు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కూరగాయల సాగు అనేది ఎవర్ గ్రీన్ బిజినెస్ సీజన్ ను బట్టి మీరు పంటలను వేసుకోవడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
కూరగాయల సాగుకు ఎక్కువ సమయం కూడా పట్టదు అయితే కేవలం కూరగాయల సాగుతో మాత్రమే లక్షల్లో ఆదాయం లభిస్తుందా? అంటే అది ఒకటి మాత్రమే కాదు అనుబంధ కుటీర పరిశ్రమలను స్థాపించడం ద్వారా మీరు గ్రామీణ ప్రాంతంలోని చక్కటి ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది. అలాగే మరో నలుగురికి ఉపాధి కూడా కల్పించవచ్చు ఇప్పుడు అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కూరగాయల సాగు మాత్రమే కాదు కూరగాయలను సోలార్ డ్రై చేసి విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందవచ్చు. ఇందుకోసం సోలార్ డ్రైవ్ మెషిన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కూరగాయ ముక్కలను ఎండబెట్టి సోలార్ డ్రై పద్ధతిలో వాటిని చిప్స్ కింద మార్చి విక్రయించవచ్చు. విదేశాల్లో ఈ డ్రై వెజిటేబుల్స్ కు చాలా డిమాండ్ ఉంది. వీటిని సాధారణ కూరగాయలు లాగానే వాడుతారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.
ఉదాహరణకు కిలో టమాట 20 రూపాయలు ఉంటే కిలో ఎండిన టమాట 300 రూపాయల వరకు ఉంటుంది. ఈ లెక్కన చూస్తే ప్రతినెల లక్షల్లో ఆదాయం లభించవచ్చు. కూరగాయలు వేస్ట్ అయ్యే అవకాశం కూడా ఉండదు. తాజా కూరగాయలు అమ్ముకుంటూనే ఈ సోలార్ డ్రై పద్ధతిలో డ్రై వెజిటేబుల్స్ విక్రయించడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.