Cockroach: బొద్దింకలతో విసిగిపోయారా..?.. ఈ టిప్స్ పాటిస్తే మీ ఇంటి వంక కన్నెత్తి కూడా చూడవు..
ఇళ్లలో చాలా మంది రకరకాల ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకుని తింటుంటారు. అయితే.. తిన్న తర్వాత వాటిని కొంత మంది ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు . దీంతో కింద ఫుడ్ కోసం బొద్దింకలు వస్తుంటాయి
ముఖ్యంగా బొద్దింకలు రాత్రిపూట సంచరిస్తుంటాయి. అవి బాత్రూమ్ల లోని పైపులల్లో, మ్యాన్ హోల్స్ లలో ఎక్కువగా కన్పిస్తుంటాయి. డస్టు బిట్ కింద కూడా బొద్దింకలు ఎక్కువగ కన్పిస్తుంటాయి.
అంతే కాకుండా.. బొద్దింకలు బాత్రూమ్ లలో కూడా కన్పిస్తుంటాయి. రాత్రిపూట ఫుడ్ ఐటమ్స్ మీద తిరుగుతు ఉంటాయి. వీటి కాళ్లకు అనేక క్రిములు ఉంటాయి. ఇది సంచరించిన పదార్థాలు తింటే రోగాలు వస్తాయి.
కొన్ని టిప్స్ పాటిస్తే మాత్రం బొద్దింకల బాధ నుంచి బైటపడొచ్చు. బొద్దింకలు ఉన్న చోట బ్లీచింగ్ పౌడర్ వేయాలి, లవంగాలను నీళ్లలో వేసి బొద్దింకలుఉన్న చోట చల్లాలి. సబ్బు నీళ్లను కూడా.. బొద్దింకలు ఉన్నచోట చల్లుతు ఉండాలి.
బిర్యానీ ఆకులంటే బొద్దింకలకు అస్సలు పడదంట.ఈ వాసనకు బొద్దింకలు దూరంగా పారిపోతాయంట. కొన్ని రకాల మార్కెట్ లో దొరికే రసాయనాలను ఉపయోగించిన కూడా వీటి నుంచి బైటపడొచ్చు.
అన్నింటి కంటే ముందు మనం కిచెన్ లో శుభ్రతను పాటించాలి. తిన్న తర్వాత ఫుడ్ ఐటమ్స్ లను కింద పడకుండా జాగ్రత్తలు పాటించాలి. ఇలా చేస్తే బొద్దింకల సమస్యల నుంచి బైటపడోచ్చు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)