Shreya Ghoshal pics: శ్రేయాఘోషల్ సింగర్ మాత్రమే కాదు.. చందమామలాంటి రూపం ఆమె సొంతం
శ్రేయాఘోషల్ 1984లో పశ్చిమ్ బెంగాల్లో జన్మించింది. అయితే ఆమె పెరిగింది మాత్రం రాజస్థాన్లోని కోటాకు సమీపంలో ఓ చిన్న టౌన్లో.
జీ టీవీలో వచ్చే స రె గా మా పా.. సింగింగ్ టాలెంట్ షో ద్వారా 2000 సంవత్సరంలో విజయం సాధించి. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.
2002లో వచ్చిన హిందీ చిత్రం దేవ్దాస్ ద్వారా నేపథ్య గాయనిగా మారింది శ్రేయాఘోషల్. ఆ తర్వాత ఇతర భాషల్లోనూ అవకాశాలు మొదలయ్యాయి.
శ్రేయాఘోషల్ 2015లో వ్యాపారవేత్త శీలాదిత్య ముక్తోపాద్యాయను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు.
హిందీ తర్వాత.. కన్నడ, తెలుగు సినిమాల్లోనే అత్యధికంగా పాటలు పాడారు శ్రేయా ఘోషల్. ఇప్పటి వరకు మొత్తం 2,400 పై చిలుగు పాటలు పాడటం విశేషం.